PAWAN KALYAN: ఓజీ తుపాన్.. ముంబై హార్బర్‌లో ఒరిజినల్ గ్యాంగ్ స్టర్స్

రీసెంట్‌గానే ఓజి మూవీని సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. దీంతో సోషల్ మీడియా షేక్ అయిపోంది. ఇక ఇప్పుడు మరోసారి ట్రెండింగ్‌లో ఉంది ఓజి. లేటెస్ట్‌గా సుజీత్ పవన్ ఫ్యాన్స్‌కు సూపర్ హై ఇచ్చాడు.

  • Written By:
  • Publish Date - February 17, 2024 / 12:22 PM IST

PAWAN KALYAN: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను ఓ డై హార్డ్ ఫ్యాన్ డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో.. ఓజి మూవీతో చూపించబోతున్నాడు సుజీత్. సాహో మూవీ తర్వాత పవన్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్ అందుకున్నాడు సుజీత్. మామూలుగానే సుజీత్‌.. పవన్‌కు డై హార్డ్ ఫ్యాన్. అలాంటి అభిమాని తన ఫేవరేట్ హీరోను ఎలా చూపిస్తాడో ఊహించుకోవచ్చు. ఇప్పటికే హంగ్రీ చీతా అంటూ.. ఓజి గ్లింప్స్ రిలీజ్ చేసి, పవన్ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ ఫీస్ట్ ఇచ్చాడు.

Nalgonda BRS fight : కుమ్ములాటల్లో నల్లగొండ BRS నేతలు… కేసీఆర్ కి కొత్త సమస్య !

దీంతో ఓజి థియేటర్లోకి రావడమే లేట్.. ఓ రేంజ్‌లో రికార్డులు లేస్తాయని అంటున్నారు పవన్ ఫ్యాన్స్. ఈ సినిమా అనౌన్స్మెంట్ నుంచి పవన్ ఫ్యాన్స్‌కు సోషల్ మీడియాలో సాలిడ్ రిప్లై ఇస్తూ మంచి కిక్ ఇస్తోంది నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్. ఊహించకుండానే అప్డేట్స్ ఇస్తున్నారు. రీసెంట్‌గానే ఓజి మూవీని సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. దీంతో సోషల్ మీడియా షేక్ అయిపోంది. ఇక ఇప్పుడు మరోసారి ట్రెండింగ్‌లో ఉంది ఓజి. లేటెస్ట్‌గా సుజీత్ పవన్ ఫ్యాన్స్‌కు సూపర్ హై ఇచ్చాడు. తన ఇన్‌స్టాగ్రామ్ డీపీని పవన్‌తో కలిసి దిగిన ఫొటోను సెట్ చేసుకున్నాడు. ఇందులో పవర్ స్టార్.. సుజీత్ భుజం మీద చేయి వేసి ఉండగా.. సుజీత్ క్యాప్ పెట్టుకుని కనిపిస్తున్నాడు.

కాకపోతే ఈ ఫొటోలో ఇద్దరు బ్యాక్ సైడ్ తిరిగి ఉన్నారు. ఈ ఫోటో బాంబే హార్బర్ ఏరియాలో ఓజి షూటింగ్ జరిగినప్పుడు తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మరి ముంబై హార్బర్‌లో ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ ఎలాంటి ఊచకోత తెలియాలంటే.. సెప్టెంబర్ 27 వరకు వెయిట్ చేయాల్సిందే.