నిజమే, 40 కోట్లు పవన్ కి సమర్పించారు, కేవలం 20 రోజులకు పవర్ స్టార్ కి అంత సమర్పించటం సమంజసమా అన్నారు. కాని ఏమైంది బ్రో మూవీ ప్రిరిలీజ్ బిజినెస్ తో 200 కోట్లు దక్కాయి. బ్రో మూవీ తెలంగాణ రైట్స్ 30 కోట్లకు సేల్ అయితే ఆంధ్రా రైట్స్ 40 కోట్లు, సీడెడ్ 10 కోట్లకు సేల్ అయ్యాయి. ఇక యూఎస్ రైట్స్ 20 కోట్లు అయితే, శాటిలైట్ రైట్స్ 45 కోట్లు, ఓటీటీ రైట్స్ 55 కోట్లు పలికాయి.
సో కేవళం థియేట్రికల్ రైట్సే 100 కోట్లయితే, నాన్ థియేట్రికల్ రైట్స్ 100 కోట్లని తేలింది. మొత్తానికి పవన్ కి 40 కోట్లు, సాయితేజ్, తోపాటు హీరోయిన్లు, మిగతా బ్యాచ్ కి కలిపి మొత్తంగా మూవీకి పెట్టింది 75 కోట్లు..అవి పోనూ 125 కోట్లు నిర్మాతకి లాభం రూపంలో రిలీజ్ కిముందే దక్కాయి.. ఇది పవన్ కళ్యాణ్ స్టామినా.