Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్‌కి షాక్ ఇచ్చిన ఓజీ మూవీ నిర్మాత..!

ఆల్రెడీ 85 శాతం ఓజీ మూవీ షూటింగ్ అయిపోయింది. కొత్త షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది. అలాంటి టైంలో ఇలా రిలీజ్ డేట్ లీకవ్వటం ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చే విషయమే. సుజీత్‌ని విష్ చేసే ప్రాసెస్‌లో ఈ ఏడాది పేల్చిపడేద్దాం అన్న నిర్మాత ట్వీట్ హాట్ టాపిక్ అయ్యింది.

  • Written By:
  • Publish Date - October 26, 2023 / 06:16 PM IST

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చే న్యూస్‌ని అనుకోకుండా లీక్ చేశాడు ఓజీ మూవీ ప్రొడ్యూసర్. ఏదో చేయబోతే ఇంకేదో జరిగినట్టు డైరెక్టర్ సుజీత్‌కి బర్త్ డే విషెస్ చెప్పబోయి టంగ్ స్లిప్ అయ్యాడు నిర్మాత. మొత్తానికి ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ అవటం తథ్యం అని తేలింది. ఆల్రెడీ 85 శాతం ఓజీ మూవీ షూటింగ్ అయిపోయింది. కొత్త షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది. అలాంటి టైంలో ఇలా రిలీజ్ డేట్ లీకవ్వటం ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చే విషయమే.

సుజీత్‌ని విష్ చేసే ప్రాసెస్‌లో ఈ ఏడాది పేల్చిపడేద్దాం అన్న నిర్మాత ట్వీట్ హాట్ టాపిక్ అయ్యింది. ఈ ఏడాది పేల్చి పాడేద్దాం అంటే.. దానర్ధం ఈ ఇయరే ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ (ఓజీ) రిలీజ్ కన్ఫామ్ అయినట్టే. అంతేకాదు క్రిస్మస్‌కి ఈ సినిమా వస్తుందన్న పుకార్లకు కూడా బ్రేక్ పడుతోంది. ఎందుకంటే అప్పుడు సలార్ రాబోతోంది. కాబట్టి, క్లాష్ వద్దనే ఓజీ ఫిల్మ్ టీం ఓ క్లారిటీకి వచ్చింది. దాని ప్రకారం దీపావళి, క్రిస్మస్ రెండు సీజన్లను ఓజీ టీం పక్కన పెట్టింది. డిసెంబర్ 31కి ఓజీని రిలీజ్ చేయబోతోంది.

అలా అయితే సలార్‌కి, ఓజీకి పది రోజులు గ్యాప్ ఉంటుంది. అలాగే సంక్రాంతి సినిమాలతో కూడా పోటీ ఉండదు. అలానే ఇయర్ ఎండ్, న్యూ ఇయర్ అకేషన్స్‌కి సీన్ మారిపోతుంది. కాబట్టే, ఓజీ టీం ఈ ఏడాది ఎండింగ్‌కి రీసౌండ్ చేసేందుకు ప్రిపేర్ అయ్యిందని తేలిపోయింది.