PAWAN KALYAN: 1000 కోట్లపై కన్నేసిన పవన్ కళ్యాణ్.. ఓజీతో రికార్డులు ఖాయం..

పవన్‌కి నిజంగానే వెయ్యికోట్ల ప్యాకేజీ ఆఫర్ ఉంది. కాకపోతే అది సినిమాల్లో అని తెలుస్తోంది. పవన్ నటిస్తున్న ఓజీ మూవీ పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కాబోతోంది. కేవలం హిందీ రైట్సే రూ.130 కోట్ల ధర పలికాయి.

  • Written By:
  • Updated On - March 21, 2024 / 07:59 PM IST

PAWAN KALYAN: పవర్ స్టార్ సినిమాలు చేస్తే రోజుకు రెండు కోట్లు వస్తాయి. అంటే ఏడాది మొత్తంలో 200 రోజులు సినిమాలు చేస్తే రూ.400 కోట్లు సంపాదించే సత్తా ఉంది. అలాంటి తను ఇంకాస్త టైం కేటాయిస్తే, రెండేళ్లకు వెయ్యికోట్లు వెనకేసుకోవటం పెద్ద విషయం ఏం కాదు. కాని ఆమాత్రం కూడా తెలియకుండా, ఎవరో ఇచ్చే ప్యాకేజీకి పవన్ ఆశపడతాడని యాంటీ ఫ్యాన్స్, ముఖ్యంగా రాజకీయ ప్రత్యర్ధులు ప్రచారం చేస్తుంటారు.

Rashmika Mandanna: వదలని లీకులు.. జేజెమ్మలా శ్రీవల్లి..

ఇవన్నీ రాజకీయాల్లో కామన్ అయినా, ఫ్యాన్స్‌కి మాత్రం డైజెస్ట్ కాని అంశాలు. అవన్నీ పక్కన పెడితే, పవన్‌కి నిజంగానే వెయ్యికోట్ల ప్యాకేజీ ఆఫర్ ఉంది. కాకపోతే అది సినిమాల్లో అని తెలుస్తోంది. పవన్ నటిస్తున్న ఓజీ మూవీ పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కాబోతోంది. కేవలం హిందీ రైట్సే రూ.130 కోట్ల ధర పలికాయి. ఇక ఓవర్ సీస్ రూ.50 కోట్లు, తెలుగు థియేట్రికల్ రైట్స్ కూడా రూ.180 కోట్లు ధర పలుకుతుండటంతో సీనే మారిపోతోంది. ఇది మరో బాహుబలి కాకపోయినా మరో పఠాన్, మరో జవాన్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. పవన్‌కి అంతటా ఫ్యాన్స్ ఉన్నా.. ఇంతవరకు పాన్ ఇండియా హిట్ పడలేదు. భీమ్లానాయక్ అన్ని భాషల్లో చేయాలి అనుకున్నారు. అలా చేసుంటే లెక్కమారేది. కానీ, తెలుగులోనే రిలీజ్ అయ్యింది. అయినా ఆ వెలితిని తీర్చేందుకు ఓజీ మూవీ రెడీ అయ్యింది. ఈ సినిమా మరాఠీ, పంజాబీ, భోజ్‌పురి, బెంగాలీలో కూడా రాబోతోంది.

ఏమాత్రం ఈ సినిమా బాగున్నా.. పుష్ప, కేజీయఫ్, త్రిబుల్ ఆర్ రేంజ్‌లో ఆడే ఛాన్స్ ఉంది. అదే జరిగితే వెయ్యి కోట్ల వసూళ్లు పెద్ద మ్యాటేరే కాదు. ఆల్రెడీ ఈ ఏడాది కల్కి, దేవర, పుష్ప 2, గేమ్ ఛేంజర్ రాబోతున్నాయి. సీజన్‌కో పాన్ ఇండియా మూవీ రాబోతోంది. అన్నీ హిట్టైతే, సినిమాకు వెయ్యికోట్ల చొప్పున 4 వేల కోట్ల వసూళ్లతో టాలీవుడ్ ఈ ఏడాది నెంబర్ వన్ ప్లేస్‌లో ఉండటం ఖాయం.