Pawan Kalyan: హిస్టరీ రిపీట్.. అప్పుడు ‘అత్తారింటికి దారేది’.. ఇప్పుడు ఓజీ

పవర్ స్టార్ రేంజ్‌కి తగ్గ వసూళ్ళ సునామీ సృష్టించే సత్తా ఓజీ సినిమాకి ఉందని ఆయన ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ఆ అంచనాలను, ఫ్యాన్స్ నమ్మకాన్ని రెట్టింపు చేసింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

  • Written By:
  • Updated On - January 30, 2024 / 05:12 PM IST

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ‘అత్తారింటికి దారేది’ సినిమా 2013లో సెప్టెంబర్ 27న విడుదలై ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అయితే సరిగ్గా 11 ఏళ్లకు అదే తేదీకి పవన్ కళ్యాణ్ నటించిన ఓ సినిమా రాబోతుంది. పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతోన్న గ్యాంగ్‌స్టర్ ఫిల్మ్ ‘ఓజీ’ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పవర్ స్టార్ రేంజ్‌కి తగ్గ వసూళ్ళ సునామీ సృష్టించే సత్తా ఓజీ సినిమాకి ఉందని ఆయన ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.

Imran Khan: ఇమ్రాన్‌ఖాన్‌కు షాక్.. సైఫర్ కేసులో పదేళ్ల జైలు శిక్ష..

ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ఆ అంచనాలను, ఫ్యాన్స్ నమ్మకాన్ని రెట్టింపు చేసింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ని లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాని సెప్టెంబర్ 27న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు సమాచారం. అయితే అది ‘అత్తారింటికి దారేది’ విడుదలైన తేదీ కావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి ‘ఓజీ’ కూడా ‘అత్తారింటికి దారేది’ మాదిరిగానే బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తుందేమో చూడాలి. ఇప్పటికే ‘ఓజీ’ చిత్రీకరణ 70 శాతానికి పైగా పూర్తయిందని సమాచారం.

ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ సినిమా కోసం డేట్స్ కేటాయించనున్నాడు. పవన్ ఇప్పటికే దాదాపు ఆయన షూటింగ్ పార్ట్‌ని పూర్తి చేశాడట. కేవలం మరో రెండు వారాల డేట్స్ కేటాయిస్తే సరిపోతుందని వినికిడి. దీంతో ఈ సినిమాను కంప్లీట్ చేయడానికి డేట్స్ కూడా ఇస్తున్నట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.