Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. OG సినిమాతోనే అకిరా ఎంట్రీ..?

సుజీత్‌ డైరెక్షన్‌లో పవన్ కళ్యాణ్‌ ఓజీ సినిమా తీస్తున్నారు. ఈ సినిమాలో పవన్‌ కళ్యాణ్‌ చిన్నప్పటి రోల్‌ను అకీరాతో చేయించబోతున్నారనే టాక్‌ నడుస్తోంది. దీని గురించి అఫీషియల్‌గా ఎలాంటి ఇన్ఫర్మేషన్‌ లేకపోయినా.. ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నట్టు సమాచారం.

  • Written By:
  • Publish Date - May 4, 2023 / 11:38 AM IST

Pawan Kalyan: తెలుగు సినీ ఇండస్ట్రీలో దుమ్ము లేచిపోయే ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరోల్లో పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ టాప్‌లో ఉంటాడు. ఆయన సినిమా నుంచి ఏదైనా అప్‌డేట్‌ వచ్చిందంటే ఫ్యాన్స్‌కు ఇక పండగే. అలాంటిది ఇప్పుడు ఏకంగా పవన్ తనయుడు అకిరా నందన్ గురించిన ఓ గాసిప్‌ సినీ వర్గాలను చుట్టేస్తుంది. సుజీత్‌ డైరెక్షన్‌లో పవన్ కళ్యాణ్‌ ఓజీ సినిమా తీస్తున్నారు. ఈ సినిమాలో పవన్‌ కళ్యాణ్‌ చిన్నప్పటి రోల్‌ను అకీరాతో చేయించబోతున్నారనే టాక్‌ నడుస్తోంది.

దీని గురించి అఫీషియల్‌గా ఎలాంటి ఇన్ఫర్మేషన్‌ లేకపోయినా.. ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. ఇప్పటికే అకిరా ఎంట్రీ కోసం పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ ఎంతగానో వెయిట్‌ చేస్తున్నారు. వాళ్లకు తగ్గట్టుగానే సిక్స్‌ ఫీట్స్‌తో అకిరా హీరో ప్రొఫైల్‌ మెయిన్‌టేన్‌ చేస్తున్నాడు. దీంతో ఇప్పుడు ఓజీ సినిమాతోనే అకిరాను తెరమీదకు పరిచయం చేసే ప్లాన్‌లో ఓజీ మేకర్స్‌ ఉన్నట్టు తెలుస్తుంది. నిజానికి ఇది సినీ ఇండస్ట్రీలో కొత్తేమీ కాదు. రాజా ది గ్రేట్‌ సినిమాలో రవితేజ చిన్నప్పటి రోల్‌ను ఆయన కొడుకుతో చేయించాడు అనిల్‌ రావిపూడి. ఇప్పుడు సుజీత్‌ కూడా సేమ్‌ ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నట్టుగా తెలుస్తోంది. కానీ పవన్‌ కళ్యాణ్‌కు మాత్రం ఇలాంటి వారసత్వాలు నచ్చవు. ఈ విషయాన్ని చాలా సార్లు ఆయన ఓపెన్‌గా చెప్పేశాడు. తన తరువాత తన స్థానం అకిరాకే అని ఆయన ఎప్పుడూ చెప్పలేదు.

ఆ విషయంలో ఎంకరేజ్‌ కూడా చేయరు. దీనికి తోడు అకిరా కూడా యాక్టింగ్‌ కంటే మ్యూజిక్‌ మీదే ఎక్కువ కాన్సట్రేట్‌ చేస్తున్నాడు. హీరోగా కాకపోయినా.. మ్యూజిక్‌ డైరెక్టర్‌గా అయినా పవర్‌ స్టార్‌ కొడుకు వస్తున్నాడని ఆయన ఫ్యాన్స్‌ కుషీ అయ్యారు. కానీ ఇప్పుడు ఓజీ నుంచి వచ్చిన ఈ గాసిప్‌తో ఒక్కసారిగా అందరిలో ఆశలు రేకెత్తుతున్నాయి. ఈ గాసిప్‌ నిజం కావాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. అయితే నిజంగా సుజీత్‌.. పవన్‌ కళ్యాణ్‌ను ఒప్పిస్తారా.. పవర్‌ స్టార్‌ చిన్నప్పటి రోల్‌లో అకిరా నటిస్తారా.. లేదా అనేది వేచి చూడాలి.