Akira Nandan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణూదేశాయ్‌ల కొడుకు అకీరా నందన్‌పై అప్పుడే ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఒత్తిడి పెరుగుతోంది. క్లియర్‌గా చెప్పాలంటే అకీరాకి మోయలేనంత భారంగా మారుతోంది. ఇంకా టీనేజీలోనే ఉన్న తన మీద పెద్ద పెద్ద బాధ్యతలు రుద్ది ఒత్తిడి పెంచే కార్యక్రమాలు జరుగుతున్నాయా..? నిజంగా రవితేజ మూవీ టైగర్ నాగేశ్వరరావు ఈవెంట్‌లో బాహుబలి రైటర్ విజయేంద్రప్రసాద్ మాటలు ఓ రకంగా పవన్ ఫ్యాన్స్‌ని ఖుషీ చేశాయి. పవన్ వారసుడు అకీరా హీరోగా మారాలి.
తన తల్లి మీరే కాబట్టి రియల్ లైఫ్ పాత్రే మీరు వేయాలన్నారు. సరే పవర్ స్టార్ ఫ్యాన్స్ కోసమో, లేదంటే నిజంగానే పవన్ వారసత్వం మీద విజయేంద్ర ప్రసాద్‌కి ఉన్న అభిమానమో అనుకోవచ్చు. ఇవన్నీ నిజాలే అయినా, అందులో తప్పులేకున్నా ఈ విషయంలో అదనపు భారం మాత్రం పవన్ వారసుడు అకీరాకే పడుతోంది. తనకి నటనపై ఆసక్తిలేదు. ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేసి, దర్శకుడవ్వాలి అనుకుంటున్నాడని రేణూ దేశాయ్ ఎప్పుడో తేల్చింది. హీరో అయ్యే అర్హత, ఆ వారసత్వం ఉన్నా తాము అకీరా మీద ప్రెజర్ పెంచమనేసింది. ఇంత చెప్పినా పవన్ వారసుడిగా అకీరా రావాలని ఫ్యాన్స్ కోరుకోవటం సహజం. దీనికి తోడు సినీ పెద్దలు, దర్శక నిర్మాతలు ఇప్పటి నుంచే అకీరాని బుట్టలో వేసేయటమో, ఫ్యాన్స్‌ని ఖుషీ చేయటమో చేస్తున్నారు.
దీంతో అకీరా మీద పరోక్షంగా ప్రెజర్ పెరుగుతోంది. ఆమధ్య బ్రో మూవీ రిలీజ్ టైంలో అకీరా థియేటర్స్‌కి వస్తే పవన్ ఫ్యాన్స్ చేసిన హంగామా మామూలుగా లేదు. ఇవన్నీ ఆ అకీరా వయసుకి, తన కోరుకుంటున్న ప్రైవసీకి భారమే. పరోక్షంగా తనకి ఇది ప్రెజర్‌లా మారుతోంది. సినీ పెద్దల అంచనాలు అకీరాని కన్‌ఫ్యూజ్ చేయటమో, కంగారుపెట్టడమో చేస్తున్నాయనే అభిప్రాయం పెరుగుతోంది.