Pawan Kaylan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతోన్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. గబ్బర్ సింగ్‌తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ఈ కాంబో.. మళ్ళీ 11 ఏళ్ల తర్వాత మ్యాజిక్ క్రియేట్ చేయడానికి రెడీ అవ్వడంతో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఆ మధ్య వచ్చి గ్లింప్స్‌కు సోషల్ మీడియా బద్దలైపోయింది. అయితే కొంతకాలంగా ఈ మూవీ ఆగిపోయిందని వార్తలు వినిపించాయి.
తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు రావడం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే కొంతభాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ నెక్ట్స్ షెడ్యూల్ గురించి క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ప్రజెంట్ పవన్ పొలిటికల్ పనుల్లో బిజీగా ఉండడంతో ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ చాలా డిలే అయింది. తాజాగా ఈ సినిమా రెండవ షెడ్యూల్ ప్రారంభానికి సంబంధించి మూవీ యూనిట్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. ఈ మూవీ రెండవ షెడ్యూల్ సెప్టెంబర్ 5న స్టార్ట్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ షెడ్యూల్‌లో ఇంటర్వెల్ ఫైట్‌తో పాటు పవన్‌కు సంబంధించిన కీలకమైన సీన్స్ షూట్ చేయబోతున్నట్లు టాక్ నడుస్తోంది. అయితే ఈ మూవీపై మరో న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో పవన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది.
ఇప్పటికే శ్రీలీల, పవన్ మధ్య కొన్ని సీన్ల చిత్రీకరణ జరిగింది. అయితే ఇప్పుడు మరో బ్యూటీ కూడా ఉస్తాద్‌తో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతున్నట్లు టాక్ నడుస్తోంది. ఏజెంట్ మూవీలో అక్కినేని అఖిల్‌తో చిందులేసిన సాక్షి వైద్య.. పవన్‌తో జతకట్టబోతున్నట్లు టాక్ నడుస్తోంది. తేరి రీమేక్‌గా ఉస్తాద్ భగత్ సింగ్ తెరకెక్కిస్తున్నట్లు గత కొన్ని రోజులు టాక్ నడుస్తోంది. అయితే ఇప్పుడు ఇద్దరూ హీరోయిన్లను తీసుకోవడంతో అది నిజమనే నమ్ముతున్నారు. ఎందుకంటే తేరిలో కూడా ఇద్దరూ హీరోయిన్లు ఉన్నారు. మరి ఉస్తాద్‌లో ఏ బ్యూటీ.. ఏ రోల్ చేస్తుందో చూడాలి.