పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్…? గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది…

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీకి ఓ రేంజ్ ఉంది. ఆ కుటుంబం నుంచి ఎంతమంది హీరోలు వచ్చినా అభిమానులు ఆదరిస్తూనే ఉన్నారు. దాదాపు మూడు దశాబ్దాల నుంచి టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ డామినేషన్ నడుస్తూనే ఉంది. అయితే ఆ ఫ్యామిలీలో విభేదాలు మాత్రం ఎప్పుడూ బయటపడలేదు.

  • Written By:
  • Updated On - November 3, 2024 / 06:20 PM IST

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీకి ఓ రేంజ్ ఉంది. ఆ కుటుంబం నుంచి ఎంతమంది హీరోలు వచ్చినా అభిమానులు ఆదరిస్తూనే ఉన్నారు. దాదాపు మూడు దశాబ్దాల నుంచి టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ డామినేషన్ నడుస్తూనే ఉంది. అయితే ఆ ఫ్యామిలీలో విభేదాలు మాత్రం ఎప్పుడూ బయటపడలేదు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తలు వచ్చినా అవి నిజం కాదని తేలిపోయింది. మీడియా ఎంత హడావుడి చేసినా వారి మధ్య విభేదాలు ఎప్పుడూ తీవ్ర స్థాయిలో బయటపడిన సందర్భాలు లేవనే చెప్పాలి.

అయితే అల్లు అర్జున్ మాత్రం మెగా ఫ్యామిలీ ఇమేజ్ నుంచి బయటకు రావడానికి కష్టపడుతున్నాడనే విషయం స్పష్టంగా అర్ధమవుతోంది. పుష్ప సినిమాతో తాను ఏంటీ అనేది ప్రూవ్ చేసుకున్నాడు అల్లు అర్జున్. ఈ సమయంలో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్స్ ఉన్నారనే విషయం చెప్పుకునేందుకు ప్రయత్నం చేసాడు. ఇక సోషల్ మీడియాలో కూడా అల్లు అర్జున్ ఆర్మీ ట్రెండ్ అవుతోంది. అందరికి ఫ్యాన్స్ ఉంటే తనకు ఆర్మీ ఉంది అంటూ బన్నీ చేసిన కామెంట్స్ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ కు ఒళ్ళు మండేలా చేసింది అంటూ కామెంట్స్ వచ్చాయి.

ఇక మొన్నటి ఎన్నికల్లో బరిలో జనసేన ఉంటే… వైసీపీ అభ్యర్ధి కోసం ప్రచారం చేయడం సంచలనం అయింది. దీనిపై మెగా ఫ్యాన్స్ ఘాటుగానే విమర్శలు చేసారు కూడా. పవన్ ఫ్యాన్స్ అయితే… మేనమామ కంటే ఫ్రెండ్ ఎక్కువా అంటూ ఫైర్ అయిపోయారు. అయితే ఇప్పుడు బన్నీలో కాస్త మార్పు వచ్చినట్టు తెలుస్తోంది. మెగా ఫ్యామిలీతో దూరం తగ్గించుకోవాలని బన్నీ భావిస్తున్నాడు. ఆహాలో ప్రసారం అయ్యే అన్ స్టాపబుల్ షోలో పుష్ప ప్రమోషన్స్ ప్లాన్ చేసి… తాను వైసీపీకి ఎందుకు ప్రచారం చేయాల్సి వచ్చిందో క్లారిటీ ఇవ్వాలని భావిస్తున్నాడు.

ఇప్పటికే దీనికి సంబంధించి షూట్ కంప్లీట్ అయిందని టాక్. ఇక పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతి లేదా చిత్తూరులో నిర్వహించాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించాలని బన్నీ ప్లాన్ చేసినట్టు టాక్. అమరావతి వచ్చి పవన్ కు ఆహ్వానం పలికే విధంగా ప్లాన్ చేసినట్టు సమాచారం. దీనికి సంబంధించి త్వరలోనే అల్లు అరవింద్, హీరోయిన్ రష్మిక మందన, నిర్మాతలతో కలిసి బన్నీ వెళ్ళే ఛాన్స్ ఉంది. కాగా సినిమా రిలీజ్ ను ఒక రోజు ముందుకు జరిపారు. డిసెంబర్ ఆరున విడుదల కావాల్సిన సినిమాను 5నే విడుదల చేస్తున్నారు.