బాలీవుడ్ లో మార్మోగిన పవన్ పేరు

డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్... ఇప్పుడు మార్మోగుతున్న పేరు. ఇండియాలో ప్రస్తుతం ఉన్న ఏ స్టార్ హీరోకి లేని ఫాలోయింగ్ పవన్ కళ్యాణ్ సొంతం. సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాల్లో బిజీ అయిపోయారు.

  • Written By:
  • Publish Date - September 14, 2024 / 12:51 PM IST

డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్… ఇప్పుడు మార్మోగుతున్న పేరు. ఇండియాలో ప్రస్తుతం ఉన్న ఏ స్టార్ హీరోకి లేని ఫాలోయింగ్ పవన్ కళ్యాణ్ సొంతం. సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాల్లో బిజీ అయిపోయారు. సినిమాల్లో తన పవర్ చూపించిన పవన్ ఇప్పుడు రాజకీయాల్లో తన పవర్ చూపించడానికి కష్టపడి పని చేస్తున్నారు. వైసీపీని అధఃపాతాళానికి తోక్కుతా అని చెప్పి మరీ తొక్కిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పాలనపై పట్టు పెంచుకుంటున్నారు.

కీలక శాఖల్లో సమూలమైన మార్పులు తెచ్చేందుకు పట్టుదలగా కష్టపడుతున్నారు ఆయన. 21 స్థానాల్లో పోటీ చేసి పార్టీని 21 స్థానాల్లో గెలిపించారు పవన్. మంత్రి వర్గంలో మూడు మంత్రి పదవులను తన పార్టీకి తీసుకున్న పవన్… వారిని కూడా ఏ తప్పులు చేయొద్దని, ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావద్దని హెచ్చరించి పని చేయిస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ పేరు జాతీయ స్థాయిలో మార్మోగింది. హిందీలో బాగా పాపులర్ అయిన కౌన్ బనేగా కరోడ్ పతిలో పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఓ ప్రశ్న అడిగారు.

2024లో జూన్ లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటి సిఎంగా బాధ్యతలు స్వీకరించిన నటుడు ఎవరు అని కంటెస్టంట్ ని అడిగారు బిగ్ బీ. ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో ఆడియన్స్ పోల్ తీసుకున్నారు. ఆడియన్స్ లో 50 శాతం మంది పవన్ కళ్యాణ్ అని చెప్పారు. దీనితో పవన్ కళ్యాణ్ పేరు లాక్ చేయగా అది కరెక్ట్ ఆన్సర్ అయింది. దీనితో కంటెస్టంట్ 1.6 లక్షలు గెలుచుకుని తర్వాతి ప్రశ్నకు వెళ్ళారు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ ఫ్యాన్స్ అయితే ఇది మా రేంజ్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాల మీద కూడా ఫోకస్ చేస్తున్నారు. వచ్చే ఏడాది తాను నటించే మూడు సినిమాలను విడుదల చేయనున్నారు. త్వరలోనే షూటింగ్ మొదలుకానుంది.