పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడి సినీ ఎంట్రీ కోసం పవన్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు. దాదాపు మూడేళ్ళ నుంచి పవన్… కొడుకుని సినిమాల్లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు స్టార్ట్ చేసారు. తాను సినిమాలకు దూరం అయ్యే అవకాశం ఉండటంతో కొడుకుని సినిమాల్లోకి తెచ్చేందుకు తన వారసత్వాన్ని కంటిన్యూ చేసేందుకు పవన్ అన్ని విధాలుగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ అకీరా మాత్రం రెడీగా లేనట్టు ప్రచారం జరిగింది. అకీరాను అమెరికా పంపి యాక్టింగ్ స్కూల్ లో ట్రైనింగ్ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి.
ఇక కొడుకుని ఇప్పుడు హరిహర వీరమల్ల్లు లేదంటే ఓజీ సినిమాల్లో ఓ కీ రోల్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నట్టు గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. పవన్ ఆలోచనకు అకీరా కూడా ఓకే చెప్పాడని టాక్. ఓజీలో అకీరా, పవన్ కు తమ్ముడిగా నటించే ఛాన్స్ ఉందని టాక్. ఇందుకోసం సుజిత్ ఓ పవర్ ఫుల్ రోల్ కూడా రెడీ చేసాడని ఈ మధ్య టాలీవుడ్ సర్కిల్స్ లో ఓ రూమర్ స్ప్రెడ్ అయింది. ఇక రేణు దేశాయ్ కూడా అకీరా ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్ లో ఆమెకు పరిచయాలు ఉండటంతో… అక్కడి నుంచి ప్లాన్ చేసారనే టాక్ వచ్చింది.
అయితే తెలుగులో అకీరాకు ఫ్యాన్స్ సపోర్ట్ ఉంటుందని ఫస్ట్ మూవీ గ్రాండ్ గా ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తే బెటర్ అని పవన్ భావిస్తున్నట్టు టాక్. ఓ వైపు వారసులు ఒక్కొక్కరు టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారు. నందమూరి కుటుంబం నుంచి ఇద్దరు వారసులు ఎంట్రీకి రెడీ అయ్యారు. నాలుగో తరం వారసులకు రూట్ మ్యాప్ రెడీ అయింది. కాని అకీరా మాత్రం లేట్ కావడంతో… మంచిది కాదని భావించిన పవన్… వర్క్ స్టార్ట్ చేసేసారు. ఇప్పుడు అకీరాను యాక్టింగ్ స్కూల్ కు పంపి… కంప్లీట్ గా రెడీ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
తనకు నటనలో గురువు అయిన సత్యానంద్ వద్దనే తన కొడుక్కు కూడా ట్రైనింగ్ ఇవ్వాలని పవన్ భావిస్తున్నారు. అకీరా రెండు రోజుల క్రితమే ట్రైనింగ్ లో కూడా జాయిన్ అయినట్టు టాక్. ఆరు నెలల పాటు అకీరా ట్రైనింగ్ తీసుకుంటాడు. ఇప్పటికే డాన్స్ ట్రైనింగ్ కూడా ఇచ్చినట్టు టాక్. అలాగే మార్షల్ ఆర్ట్స్ లో కూడా ట్రైనింగ్ కంప్లీట్ అయింది. పవన్ ప్రస్తుతం చేసే మూడు సినిమాల తర్వాత… ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై క్లారిటీ ఇవ్వడం లేదు. సో ఇప్పుడు అకీరా ఎంట్రీ ఇస్తే పవన్ కు ఇబ్బంది ఉండదు.