ఓతల్లిగా అఖీరా తన బిడ్డే అయినా, తను పవన్ వారసుడనేది కూడా వాస్తవమే. పవన్, రేణూ విడిపోయినా అఖీరా తో పాటు కూతురు భాద్యతలు ఇద్దరూ చూసుకుంటున్నారు. ఐతే గోరంత విషయానికి రేణూ కొండంతలు ఊహించుకుని కాస్త అతిగా రియాక్ట్ అయ్యిందని కొందరు, లేదు తల్లిగా తన స్పందనలో తప్పేముందని ఇంకొందరు రియాక్ట్ అవుతున్నారు
ఐతే ఒకటి మాత్రం నిజం రేణూ దేశాయ్ ని ఇంకెంతకాలం విలన్ గా చూస్తారనే తను వేసిన ప్రశ్నే అందరినీ ఆలోచనలో పడేసింది. పవన్, రేణూ విడపోవటం వాళ్ల వ్యక్తిగతం. ఎవరు తప్పో ఎవరు కరెక్టో అనేది వాళ్లే నిర్ణయించుకోవాల్సిన విషయం. అన్నీంటికి మించి ఇదంతా గతం. మరి ఈ గతాన్ని ఫ్యాన్స్ రియాక్షన్స్ బయటికి తీస్తున్నాయా? లేదంటే రేణూ దేశాయ్ కావాలనే ఇలా పవన్ ఫ్యాన్స్ మీద విరుచుకుపడుతుందనే రాజకీయ కోణం ఉందా..? ఇలాంటి డౌట్లే రోజుకోరకరంగా సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఏదేమైనా ఇంకా పవన్, రేణూ గత జ్ఞాపకాలను తవ్వటమో, వాళ్ల మధ్యలోకి ఫ్యాన్స్ వెళ్లటమో, సరైంది కాదనే చర్చే భారీగా పెరిగింది. ఇదెప్పుటికి ముగుస్తుందో తేలకుండాపోతోంది.