పవర్ స్టార్, ఏపీ డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. సీజ్ ది షిప్ అంటూ ఆయన కాకినాడ పోర్ట్ లో చెప్పిన ఓ డైలాగ్ ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో భూకంపం క్రియేట్ చేసింది. ఈ వీడియోను పవన్ ను ట్రోల్ చేసే వాళ్ళు కూడా వైరల్ చేస్తున్నారు. సినిమాకు మించి ఈ డైలాగ్ ఉందని, యానిమల్ సినిమాలో మ్యూజిక్ ను యాడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ వీడియోతోనే కాదు మరో వీడియోతో కూడా పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాను షేక్ చేయడానికి రెడీ అవుతున్నారు.
ఎస్ పవన్ నుంచి ఫ్యాన్స్ కు బిగ్ సంక్రాంతి గిఫ్ట్ రానుంది. ప్రస్తుతం మూడు సినిమాలను లైన్ లో పెట్టి స్లోగా కంప్లీట్ చేస్తున్న పవన్ కళ్యాణ్… సితారా బ్యానర్ లో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ చేయనున్నారు. సూర్యదేవర నాగ వంశీ… రీసెంట్ గా ఓ ప్రకటన చేసారు. ఓ స్టార్ హీరోతో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమాను చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఈ మూవీ పవన్ కళ్యాణ్ తోనే అని ఫైనల్ అయిపోయింది. 2027 లో ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల తర్వాత ఈ సినిమా స్టార్ట్ చేస్తారు.
ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా షూట్ జరుగుతోంది. గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ ఈ సినిమాను మళ్ళీ రీ స్టార్ట్ చేసారు. ఈ మేరకు ఓ పోస్టర్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత ఓజీ సినిమాను పవన్ స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను కంప్లీట్ చేస్తారు. కథలో కొన్ని మార్పులు ఉండటంతో డైరెక్టర్ హరీష్ శంకర్ ఆ పనిలో ఉన్నట్టు టాక్. త్వరలోనే షూట్ స్టార్ట్ కానుంది.
వచ్చే ఏడాది పవన్ నుంచి రెండు మూవీస్ రానున్నాయి. అలాగే రెండు మూవీస్ సెట్స్ పైకి వెళ్తాయి. అందులో సితారా బ్యానర్ లో త్రివిక్రమ్ డైరెక్షన్ లో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ. త్రివిక్రమ్… బన్నీతో ఓ సినిమా జనవరి నుంచి స్టార్ట్ చేస్తాడు. ఆ సినిమా తర్వాత పవన్ తో పొలిటికల్ మూవీని ప్లాన్ చేసాడు. నేషనల్ పాలిటిక్స్ కోసం ఈ సినిమాను పవన్ చేస్తున్నట్టు టాక్. భారీ బడ్జెట్ తోనే ఈ సినిమా ప్లాన్ చేసారు మేకర్స్. పవన్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా… సంక్రాంతి టైం లో సినిమాను అనౌన్స్ చేస్తారు.