Mohammad Shami: ప్రస్తుతం వన్డే ప్రపంచకప్ 2023 జోరు నడుస్తుంది. ఈ టోర్నీలో భారత జట్టు ఎంతో పటిష్టంగా ఉంది. ఇక పేసర్ షమీ ఫర్ఫార్మెన్స్ మాములుగా లేదు. ఈ టోర్నీలో ఆడింది నాలుగు మ్యాచ్‌లే అయినా ప్రతి ఆటలో విజృంభించిన తీరుకు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటివరకు నాలుగు మ్యాచుల్లో 16 వికెట్లు తీశాడు. అందులో రెండు మ్యాచ్‌లలో ఐదేసి వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. అందుకే దేశమంతటా షమీ హాట్ టాపిక్‌గా మారాడు.
Guntur Karam : త్రివిక్రమ్ సినిమాటిక్ యూనివర్స్.. గుంటూరు కారం లో యంగ్ టైగర్.. పూనకాలే
ఈ తరుణంలో బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ షమీకి ఫ్యాన్ అవడమే కాకుండా అతన్ని పెళ్లి కూడా చేసుకుంటానని సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. హాట్ బ్యూటీ షమీని పెళ్లి చేసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు రాసుకొచ్చింది. అలాగే తనకో షరతు పెట్టింది. ఈ పేసర్ ఇంగ్లీష్‌ను అనర్గళంగా మాట్లాడితేనే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. దీనిపై నెటిజన్లు పలురకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రేమకు భాషతో సంబంధం ఏంటి అని కొందరు అంటుంటే, దీనిపై షమీ ఎలా స్పందిస్తాడో అని మరికొందరు అంటున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇక ఈ బాలీవుడ్ నటి, రాజకీయ నాయకురాలైన పాయల్ ఘోష్ మంచు మనోజ్ జోడీగా ప్రయాణం సినిమాతో వెండితెరకు పరిచయమైంది. తరువాత కొన్ని సినిమాల్లో కనిపించి బాలీవుడ్‌కు మకాం మార్చింది. 2020లో రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం రామ్‌దాస్ అథవాలేకు చెందిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో ఉపాధ్యక్షురాలిగా కీలక పదవిలో ఉంది. ఇక షమీ 2014లో హసీన్ జహాన్‌ను మ్యారెజ్ చేసుకున్నాడు.
తరువాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి కోర్టు కెక్కారు. ప్రస్తుతం వీరి విడాకుల కేసు విచారణలో ఉంది. ఇలాంటి టైంలో పాయల్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరోవైపు షమీ ప్రదర్శనపై మాజీ భార్య హసీన్ జహాన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. షమీ బాగా ఆడితే, టీమిండియాలో కొనసాగుతాడన్న హసీన్ జహాన్.. అప్పుడే సంపాదించేందుకు వీలువుతుందని అభిప్రాయపడింది. అలా జరిగితేనే తమ భవిష్యత్తు బాగుంటుందని చెప్పుకొచ్చింది. అలాగే షమీకి శుభాకాంక్షలు చెబుతారా అంటూ రిపోర్టర్ ప్రశ్నించగా.. టీమిండియాకు విషెస్ చెప్తాను కానీ.. షమీకి చెప్పను అంటూ హసీన్ జహాన్ జవాబిచ్చింది. మొత్తానికి అటు పాయల్.. ఇటు షమీ మాజీ భార్య కామెంట్స్ వైరల్‌గా మారాయి.