Shaakuntalam: విజువల్ ఫీస్ట్ అవతారే నచ్చలేదు.. శాకుంతలం నచ్చుతుందా?

శాకుంతలం మూవీ పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేసి, చేతులు కాల్చుకున్నట్టే తెలుస్తోంది. సినిమా టాక్ మరీ అంత వీక్‌గా ఉంది. శాకుంతలం లాంటి పురాణ గాథల్ని తీస్తే, బాహుబలి, ఆర్ఆర్ఆర్ రేంజ్‌లో ఎంగేజింగ్ గా ఉండాలి. కాని ఆ కథని అలానే దింపేసి, గ్రాఫిక్స్‌తో భయపెడితే కష్టం.

  • Written By:
  • Publish Date - April 14, 2023 / 05:13 PM IST

Shaakuntalam: గుణశేఖర్ తన ఆస్తులు తాకట్టు పెట్టి మరీ, రూ.80 కోట్లతో చేసిన రిస్క్ శాకుంతలం. సినిమా శుక్రవారం రిలీజైంది. దిల్ రాజును ముందు పెట్టి సినిమాని భారీ రేటుకి అమ్మేందుకు చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. నిజమే.. శాకుంతలం మూవీ పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేసి, చేతులు కాల్చుకున్నట్టే తెలుస్తోంది.

సినిమా టాక్ మరీ అంత వీక్‌గా ఉంది. శాకుంతలం లాంటి పురాణ గాథల్ని తీస్తే, బాహుబలి, ఆర్ఆర్ఆర్ రేంజ్‌లో ఎంగేజింగ్ గా ఉండాలి. కాని ఆ కథని అలానే దింపేసి, గ్రాఫిక్స్‌తో భయపెడితే కష్టం. నిజంగా సినిమాలో సెకండ్ హాఫ్ సీరియల్‌లా ఉందనే టాక్ పెరిగింది. ఇక విజువల్ ఎఫెక్ట్స్ అయితే ఏ స్కూల్ పిల్లాడితో చేయించారనేంతగా, పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లా ఉందంటున్నారు. పులి, ఏనుగు విజువల్ ఎఫెక్ట్స్, యానిమేషన్స్ అయితే మరీ కార్టూన్ ప్రోగ్రామ్ కంటే దారుణంగా ఉన్నాయనే కామెంట్స్ వినబడుతున్నాయి.

శకుంతల పాత్రకి సమంత నప్పకపోవటమే కాదు, తన వాయిస్ ఏమాత్రం సెట్ అవలేదు. అసలు రాణీ రుద్రమదేవి తీసినప్పుడే ఏదో మినీయేచర్ లాంటి కాకతీయ కోటని చూసి జనం నవ్వారు. అప్పుడే గ్రాఫిక్స్ అంత అధ్వానంగా ఉన్నాయి. కనీసం ఈ సినిమాకైనా మెరుగయ్యాయా అంటే.. అదీ లేదు. సినిమాను విజువల్ ఎఫెక్ట్స్ ఘోరంగా దెబ్బతీస్తున్నాయనే చెప్పాలి. అవతార్ సీక్వెల్‌గా వచ్చిన అవతార్-2లో విజువల్ ఎఫెక్ట్స్ అంత గొప్పగా ఉంటేనే, జనం సోసోగా వచ్చారు. మరీ ఇంత పూర్ గ్రాఫిక్స్‌తో, త్రీడీ గారడీ అంటే జనాలు రావటం కష్టమే. అంత నాసిరకం గ్రాఫిక్స్‌తో చుట్టేసినట్టుంది మూవీ అంటున్నారు ప్రేక్షకులు.