ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు వెనుక ప్రమోషన్ ప్లాన్…? ప్లాన్ ప్రకారం ఫ్యాన్స్ ని ఫూల్స్ చేసారా…?

సినిమాల ప్రమోషన్ లు భిన్న రూపాలు, ఒక సినిమాను ఈ రోజుల్లో జనాల్లోకి తీసుకు వెళ్ళడానికి హీరోలు చాలా పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. ఎవరూ ఊహించని విధంగా ప్రమోషన్స్ జరుగుతున్నాయి. బాహుబలి సినిమా నుంచి ఇది బాగా ఎక్కువైంది అనే మాట వాస్తవం.

  • Written By:
  • Publish Date - September 23, 2024 / 10:07 AM IST

సినిమాల ప్రమోషన్ లు భిన్న రూపాలు, ఒక సినిమాను ఈ రోజుల్లో జనాల్లోకి తీసుకు వెళ్ళడానికి హీరోలు చాలా పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. ఎవరూ ఊహించని విధంగా ప్రమోషన్స్ జరుగుతున్నాయి. బాహుబలి సినిమా నుంచి ఇది బాగా ఎక్కువైంది అనే మాట వాస్తవం. సినిమాలను ప్రమోట్ చేయడానికి ఏ మార్గం ఉంటే ఆ మార్గం వాడుతున్నారు. పాన్ ఇండియా సినిమా అయితే తమకు ఉన్న అన్ని ఆయుధాలను బయటకు తీస్తున్నారు. సినిమా గురించి లేనిపోని వార్తలు క్రియేట్ చేయడం జనాల్లో హైప్ క్రియేట్ చేయడం చూస్తూ వచ్చాం.

ఇప్పుడు దేవర సినిమా ప్రమోషన్స్ చూస్తే అందరికి ఆశ్చర్యం కలుగుతోంది. హిందీలో ప్రమోషన్స్ చేయడానికి చిన్న చిన్న అవకాశాలను కూడా వదలలేదు. ముంబై సముద్ర తీరంలో దేవర ఫ్లెక్సీ పెట్టించారు. అమెరికా, యూకేలో కూడా ప్రమోషన్ ప్లాన్ సోషల్ మీడియా వేదికగా భారీగానే జరుగుతోంది. ఇక ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు చేసారు. సాధారణంగా ఇలాంటివి రద్దు చేస్తే ఫ్యాన్స్ కి మండిపోతుంది. అభిమాన హీరోని చూడాలని ఎక్కడి నుంచో వస్తూ ఉంటారు. ఫ్లైట్ లు, ట్రైన్ లు, బస్ లు ఇలా ఏది దొరికితే అది ఎక్కి వచ్చేస్తారు.

ఈ సినిమాకు కూడా ఫ్యాన్స్ అలాగే వచ్చారు. కానీ… కానీ “ ఫ్యాన్స్ ను కంట్రోల్ చేయలేక ఈవెంట్ క్యాన్సిల్ చేస్తున్నాం” అని ఒక ప్రకటన వచ్చింది. అందరికీ ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఆర్ఆర్ఆర్ సినిమా కంటే ఎక్కువ అయితే ఫ్యాన్స్ ఉండరుగా… బాహుబలి కంటే ఎక్కువ ఉండరుగా, కల్కీ కంటే ఎక్కువ ఉండరుగా… అసలు ఎంత మంది వస్తున్నారో ఒక అంచనా ఉంటుంది, దాని ప్రకారం ప్లాన్ ఉంటుంది. కానీ క్యాన్సిల్ అయిపోయింది. అంటే సినిమాకు క్రేజ్ ఈ రేంజ్ లో ఉంది అనే అభిప్రాయం ప్రజల్లో కలగాలి, సినిమాకు హైప్ పెరగాలి.

అందుకు ఎవరు పిచ్చోళ్ళు అయినా పర్వాలేదు అంటూ ఫ్యాన్స్ ఫైర్ అయిపోతున్నారు. ఇప్పటికే అమెరికాలో ఎక్కువ టికెట్ లు అమ్ముడు అవుతున్నాయి, ప్రీ రిలీజ్ మార్కెట్ భారీగా జరుగుతోంది అని వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఇప్పుడు ఈవెంట్ క్యాన్సిల్ చేస్తే ఎన్టీఆర్ కు ఎక్కువ క్రేజ్ ఉందనే సిగ్నల్స్ వెళ్లి జనాలు సినిమా కోసం ఎగబడతారు. ఇదో రకం వ్యూహం. ప్లాన్ ప్రకారమే ఎన్టీఆర్ బారికేడ్ల మధ్య నుంచి ప్రసంగించి ఉండవచ్చు కూడా. సినిమా ఎలా ఉంటుందో గాని ప్రమోషన్స్ మాత్రం వేరే లెవెల్ మావా. ఇలా జరిగి ఉండవచ్చు… అని మనం చెప్తే ఫ్యాన్స్ కు ఒళ్ళు మండుద్ది. అభిమానం అలాంటిది మరి. పాస్ లు ఇవ్వడంలో శ్రేయాస్ మీడియా ఒక ప్లాన్ ఫాలో అయింది. కేపాసిటీ కి మించి పాస్ లు ఇచ్చారు. వాళ్లకు ఇదేమీ కొత్త కాదు, మొదటి సినిమా కాదు. మరి ఎలా చేసారో వాళ్ళకే తెలియాలి. ఇక్కడ స్వల్ప లాఠీఛార్జి బోనస్ ఫ్యాన్స్ కి.