Rakul Preet Singh: హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో ఏడడుగులు వేశారు. ఫిబ్రవరి 21న గోవాలో కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య రకుల్, జాకీ పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. రకుల్ అండ్ జాకీ.. తమ పెళ్లిని దుబాయ్ లేదా మాల్దీవ్స్‌లో చేసుకోవాలని మొదట్లో అనుకున్నారు. ఐతే మాల్దీవ్స్ ఇష్యూ, ఇండియా టూరిజం అభివృద్ధి గురించి మోదీ మాట్లాడటంతో.. గోవాకి పెళ్లి వేదిక మార్చుకున్నారు. సౌత్ గోవాలోని ITC గ్రాండ్‌లో జరిగిన ఈ పెళ్లికి హాజరుకావాలంటూ ప్రధాని మోదీకి కూడా ఆహ్వానం పంపించారు.
SS RAJAMOULI: మళ్లీ రాజమౌళితో ప్రభాస్ సినిమా.. ఎప్పుడు మొదలవుతుందంటే..
ఐతే బిజీ షెడ్యూల్స్ వల్ల ఆయన వెళ్లడం కుదరలేదు. దీంతో సోషల్ మీడియా ద్వారా కొత్త జంటకి శుభాకాంక్షలు చెప్పారు. కొత్త ప్రయాణం మొదలు పెడుతున్న రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంటూ మోదీ నోట్ రిలీజ్ చేశారు. మీ మనసు, ఆలోచనలు ఒకటే కావాలని.. చేతిలో చేయేసి నడుస్తూ.. మీ కలలను సాకారం చేసుకోవాలని కోరుకుంటున్నానంటూ రకుల్‌కు పంపిన లేఖలో రాసుకొచ్చారు ప్రధాని మోదీ. ఐతే మోదీ విషెస్‌కి రకుల్ ప్రీత్ సింగ్ ఎమోషనల్‌గా రియాక్ట్ అయ్యారు. రీట్వీట్ చేశారు. మీరు ఇచ్చిన ఆశీర్వాదాలు తమకు ఎంతో ముఖ్యమైనవి. చాలా కృతజ్ఞతలు మోదీజీ అంటూ రాసుకొచ్చారు. మీ ఆశీర్వాదాలు గుండెను హత్తుకున్నాయి అంటూ జాకీ చెప్పుకొచ్చాడు.
జాకీ భగ్నానీ, రకుల్.. 2021లో తన లవ్‌స్టోరీని బయటపెట్టారు. అప్పట్నుంచి ముంబైలో చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతూ ప్రేమ జర్నీని బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు పెళ్లి బంధంతో ఒకటయ్యారు. పెళ్లి వేడుక మొదట సిక్కు సంప్రదాయంలో, ఆ తర్వాత సింధీ సంప్రదాయ పద్దతిలో జరిగింది. పెళ్లిని డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో చేసుకున్న ఈ జంట.. ముంబైలో అందరి కోసం త్వరలో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు.
Thankyou so much Honorable Prime Minister @narendramodi ji. Your blessings mean a lot to us 🙏🏻🙏🏻 @jackkybhagnani pic.twitter.com/Ymq7jENvUi
— Rakul Singh (@Rakulpreet) February 22, 2024