దేవర సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాను ఏంటీ అనేది ప్రూవ్ చేసుకున్నాడు. టాలీవుడ్ లో ఇప్పుడు తాను ఎవరి సపోర్ట్ లేకపోయినా, ఎవరు ఏ రేంజ్ లో ట్రోల్ చేసినా తోక్కుతా అని ప్రూవ్ చేసాడు. దేవర వసూళ్లు ఇప్పుడు యంగ్ టైగర్ కు మంచి బూస్ట్ ఇచ్చాయి. వార్ 2 షూట్ లో ఇప్పుడు మంచి జోష్ తో అటెండ్ అవుతున్నాడు తారక్. దేవరతో బాలీవుడ్ కు కూడా స్ట్రాంగ్ సిగ్నల్స్ పంపాడు తారక్. వచ్చే ఏడాది వార్ 2 హిట్ అయితే మాత్రం దేవరకు తిరుగు ఉండదు. బాలీవుడ్ లో విలన్ గా కూడా బిజీ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
బాలీవుడ్ హీరోలకు ఎన్టీఆర్ హైట్ మ్యాచ్ అవుతుంది కాబట్టి ప్రాబ్లం లేదు. అక్కడి విలన్ లు ఇక్కడ ట్రై చేస్తుంటే ఎన్టీఆర్ మాత్రం అక్కడ పాగా వేయాలని చూస్తున్నాడు. వార్ 2 హిట్ అయితే మాత్రం ఎన్టీఆర్ కు కచ్చితంగా బాలీవుడ్ లో తిరుగు ఉండదు. అటు తమిళం, కన్నడంలో కూడా ఎన్టీఆర్ ఇప్పుడు బిజీ అయ్యేందుకు ట్రై చేస్తున్నాడు. మూడు ప్రాజెక్ట్ లతో రెండు మూడేళ్ళు ఖాళీ లేకపోయినా తమిళ సినిమా కోసం దాదాపుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. వెట్రిమారన్ ఇప్పటికే స్టోరీ కూడా రెడీ చేసుకుని వెయిట్ చేస్తున్నట్టు టాక్.
ఇక ఎన్టీఆర్ కోసం ఇప్పుడు తెలుగు నిర్మాత సూర్యదేవర నాగ వంశీ ఓ పొలిటికల్ స్టోరీని రెడీ చేయించినట్టు టాక్. దీనికి సంబంధించి త్వరలోనే ఎన్టీఆర్ కు కథ కూడా చెప్తారట. కానీ… ఈ సినిమా 2029 ఎన్నికల ముందు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదంటే 2027 చివర్లో విడుదల అయ్యే ఛాన్స్ ఉండవచ్చు. డైరెక్టర్ ఎవరు అనేది క్లారిటీ లేకపోయినా… సుకుమార్ లేదంటే త్రివిక్రమ్ కావొచ్చు అని సమాచారం. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ ఉద్దేశం ఏంటీ అనేది స్పష్టత రావడం లేదు. కాని నందమూరి హీరోతోనే చేయవచ్చు అని సమాచారం.
ఇప్పుడు ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమాలపై ఫోకస్ పెట్టాడు. సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ పోతున్నాడు. ఇక దేవర హిట్ కావడంతో అటు కన్నడంలో కూడా పాగా వేయాలని చూస్తున్నాడు. అయితే పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ నేషనల్ లెవెల్ లో ఉండే ఛాన్స్ ఉందని టాక్. దీనికి సంబంధించి త్వరలోనే క్లారిటీ రానుంది. ఎన్టీఆర్ ఇప్పటి వరకు కంప్లీట్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ చేయలేదు. మరి ఈ సినిమాలో హీరో ఎన్టీఆరా…? లేక మరోకరా అనేది చూడాలి.