తెగే దాకా లాగితే అంతే ఉంటుంది. అందుకే బ్రేకప్ కి మొదట్లోనే ప్యాచప్ చేసుకోవాలి. మెగాస్టార్ (Megastar) ఫ్యామిలీ…అల్లు ఫ్యామిలీ (Allu Family) కి మధ్య బంధం పరిస్థితి ఇలాగే ఉంది. ఈ రెండు ఫ్యామిలీస్ మధ్య లింక్ ఇక దాదాపు కట్ అయినట్టే. ఒకప్పుడు మెగాస్టార్ ను చూసుకొని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి… చిరంజీవి పేరు జపించిన అల్లు అర్జున్ ఇప్పుడు పూర్తిగా యూటర్న్ తీసుకున్నాడు. తన ఐడెంటిటీని తాను చూసుకుంటున్నాడు. ఎన్నాళ్ళని మెగా ఫ్యామిలీ నీడలో బతుకుతాం… ఇప్పటికే పుష్ప మూవీతో పాన్ ఇండియా స్టార్ అయ్యాం. రేపో, మాపో గ్లోబల్ స్టార్ కూడా అవ్వొచ్చు అంటూ కలలు కంటున్నాడు అల్లు అర్జున్. పవన్ కల్యాణ్… అన్నయ్య కలలు పండెను అని అనుకుంటుంటే… అల్లు అర్జున్ మాత్రం… నా ఆర్మీ (Allu Army) … నా అల్లు ఆర్మీ అని తనకంటూ స్పెషాలిటీ ఉండాలని ఎప్పుడో చెప్పేశాడు. అల్లు రామలింగయ్య వల్ల చిరంజీవి డెవలప్ అయ్యాడు. అంటే తన తాత పెట్టిన భిక్ష.
ఇప్పుడు నేను కొణిదెల ఫ్యామిలీ (Konidela Family) పేరు చెప్పుకోవడం ఏంటని తెగ థింక్ చేస్తున్నాడు అల్లు అర్జున్.. సినిమాల నుంచి మొదలైన ఈ గొడవ… ఇప్పుడు పాలిటిక్స్ (AP Politics) కి వచ్చేసరికి పీక్స్ కి చేరింది. మొన్నటి ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ అంతా పిఠాపురంలో పవన్ కల్యాణ్ కి సపోర్ట్ చేసింది. చిరంజీవి వీడియో రిలీజ్ చేస్తే… చిరు ఫ్యామిలీలో సురేఖ, గ్లోబల్ స్టార్ రాం చరణ్, నాగబాబు ఫ్యామిలీ, మేనల్లుళ్ళు ఇలా అంతా పిఠాపురంలో తిరిగి ప్రచారం చేశారు. బన్నీ మాత్రం ఏదో బాగుండదు అన్నట్టుగా ఓ ట్వీట్ పడేసి ఊరుకున్నాడు. వైసీపీ అభ్యర్థి శిల్పా రవి కోసం… భార్యను వెంటబెట్టుకొని మరీ నంద్యాల వెళ్ళొచ్చాడు.
ఈ సంఘటన తర్వాత నాగబాబు పెట్టిన ట్వీట్ మెగా – అల్లు ఫ్యామిలీ మధ్య మరింత చిచ్చు రగిల్చింది. మనవాడైనా పరాయివాడే అంటూ అర్జున్ నంద్యాల టూర్ ని తప్పుబడుతూ నాగబాబు ట్వీట్ చేశాడు. తర్వాత చిరంజీవి క్లాస్ పీకడంతో… ఆ ట్వీట్ తొలగించి… నాలుగైదు రోజులు ట్విట్టర్ అకౌంట్ ను డిలీట్ చేశాడు నాగబాబు.
పిఠాపురం (Pithapuram) లో గ్రాండ్ విక్టరీ కొట్టి… చిరంజీవి ఇంటికి వచ్చిన పవన్ కల్యాణ్ కి గ్రాండ్ వెల్కమ్ దక్కింది. అమ్మ, అన్నా వదినలకు పవర్ స్టార్ పాదాభివందనం చేయడం… అందర్నీ అక్కున చేర్చుకోవడం… ఫ్యామిలీ మొత్తం నీరాజనాలతో పవన్ కల్యాణ్ కు స్వాగతం పలకడం… మెగా ఫ్యామిలీయే కాదు.. ప్రతి ఒక్కర్నీ కదిలించింది. క్లింకారా పుట్టినప్పుడు. RRRకి ఆస్కార్ తర్వాత మెగా ఫ్యామిలీలో ఇంత హ్యాపియస్ట్ మూవ్ మెంట్ ఇంకోటి ఉండదేమో. కానీ ఈ మెగా ఈవెంట్ కి కూడా అల్లు ఫ్యామిలీ డుమ్మా కొట్టింది. చిరంజీవితో రాసుకు పూసుకు తిరిగే అల్లు అరవింద్ కూడా ఇప్పుడు కొడుకు ఏది చెబితే అదే… అన్నట్టుగా తయారైనట్టు అర్థమవుతోంది. అందుకే మెగా ఫ్యామిలీలో జరిగే ఈవెంట్స్ కి ఆయన కూడా రావట్లేదు. ఇక పవన్ కల్యాణ్ అనే నేను అంటూ… ఏపీ మంత్రిగా పవర్ స్టార్ ప్రమాణాన్ని చూడటానికి… ఆ ఫ్యామిలీకి… ఆయన అభిమానులకు రెండు కళ్ళూ చాలలేదు. చిరంజీవి, పవన్ తో చేతులు జోడించి ప్రధాని మోడీ చేసిన హంగామా అంతా ఇంతా కాదు.. 10యేళ్ళుగా మెగా ఫ్యామిలీ ఎదురు చూస్తున్న ఈ మధుర క్షణాన్ని చూసి రామ్ చరణ్ కూడా కన్నీళ్ళు పెట్టుకున్నాడు.
ఇంతటి భారీ ఈవెంట్ కి కూడా అల్లు ఫ్యామిలీ డుమ్మా కొట్టింది. దాంతో జనరల్ గా వివాదాలకు దూరంగా ఉండే మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కి ఒళ్ళు మండిపోయింది. అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహని ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్ లో అన్ ఫాలో చేశాడు. పవన్ అంటే సాయి ధరమ్ కి పిచ్చి అభిమానం… కానీ ఆయన అల్లు ఫ్యామిలీ చూపిస్తున్న నిరాదరణను తట్టుకోలేకపోయాడు. మొత్తానికి సినిమాలతో మొదలైన మెగాస్టార్, అల్లు ఫ్యామిలీ గొడవ… పాలిటిక్స్ తో తారా స్థాయికి చేరింది. ఇప్పటికైతే రెండు ఫ్యామిలీల మధ్య బంధం దాదాపు తెగిపోయినట్టే అంటున్నారు. అటు సోషల్ మీడియాలో మెగా – అల్లు ఫ్యాన్స్ మధ్య వార్ తీవ్రంగా నడుస్తోంది. ఇది కూడా పీక్స్ చేరే అవకాశాలైతే ఉన్నయ్.