Ponniyin Selvan: మన వాళ్ళకి ఇప్పటికీ అర్థం కాని పొన్నియన్ సెల్వన్

పొన్నియన్ సెల్వన్‌ రెండో పార్ట్‌ కూడా తెలుగు వాళ్ళని కన్‌ఫ్యూజన్‌ చేసింది. ps1 అర్థం కాక తెలుగు ప్రేక్షకులు రిజక్ట్ చేస్తే.. ps2లో కూడా ఇదే తికమకను కంటిన్యూ చేశాడు మణిరత్నం. ps1లా ps2 వసూళ్లు కూడా అంతంతమాత్రంగానే వున్నాయి. ps2తో ఎలాంటి కన్‌ఫ్యూజన్‌ వుందో చూద్దాం.

  • Written By:
  • Publish Date - May 2, 2023 / 10:15 PM IST

కల్కి కృష్ణ మూర్తి రాసిన పొన్నియన్‌ సెల్వన్‌ కథను వెండితెరపైకి తీసుకురావడానికి చాలామంది ప్రయత్నించారు. దాదాపు 30 ఏళ్లుగా ఈ కథను తెరకెక్కించాలని మణిరత్నం వెయిట్ చేశాడు. మధ్యలో రెండుసార్లు ఫెయిల్‌ అయినా పట్టువదలని విక్రమమార్కుడిలా.. ఎట్టకేలకు సక్సెస్‌ అయ్యాడు. తమిళ ప్రజలకు తెలిసిన చోళ, పాంఢ్య రాజుల కథ కావడంతో.. తంబీలు పియస్‌1కు బ్రహ్మరథం పట్టారు. అయితే ఇందులో క్యారెక్టర్స్‌ ఎవరికి ఎవరు ఏమవుతారో తెలుసుకునే లోపే ఇంటర్వెల్‌ వచ్చేసింది.

ps1 పాన్‌ ఇండియా మూవీగా రిలీజైనా.. ఒక్క తమిళంలో హిట్‌ అయింది. అర్థమయ్యేలా క్యారెక్టర్స్‌ను చేప్పలేకపోకవడంతో.. తెలుగు, హిందీ ఆడియన్స్‌ రిజక్ట్ చేశారు. ps2 దగ్గరకొచ్చేసరికిఎవరు ఎవరికి శత్రువులు? ఎందుకు ఎనిమీస్‌ అయ్యారో వివరించడంలో మణిరత్నం ఫెయిల్‌ అయ్యాడు. దీంతో.. క్లారిటీ లేని ఈ కథను కూడా తెలుగు ఆడియన్స్‌ రిజక్ట్ చేశారు. ps1 లాగానే.. ps2 తెలుగు బిజినెస్‌ 10 కోట్లతో సరిపెట్టుకుంది. ఇప్పటికి 5 కోట్ల షేర్‌ కలెక్ట్ చేసింది. ఇంకో 5 కోట్ల కలెక్ట్‌ చేయడం కష్టమే అంటున్నాయి ట్రేడ్‌ వర్గాలు.

విక్రమ్‌,.. కార్తీ.. ఐశ్వర్యారాయ్‌, త్రిష వంటి హీరోహీరోయిన్లు వున్నా.. వీళ్ల స్టార్‌డమ్‌ ఉపయోగపడలేదు. ps2ను కూడా తమిళ తంబీలు మాత్రమే ఆదరిస్తున్నారు. సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల గ్రాస్‌ కలెక్ట్ చేసిందని లైకా ప్రొడక్షన్స్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేసింది. చోళ రాజుల కథ తమిళ సంస్కృతి లో భాగం. తమిళుల టెక్స్ట్ బుక్స్ లో చోళ రాజులే కనిపిస్తారు. అక్కడి వాళ్లకు చోళులను స్పెషల్ గా పరిచయం చేయనక్కర లేదు. కథ మధ్య లో చెప్పిన తెలిసిపోతుంది. కానీ మన పరిస్థితి వేరు. మనిరత్నం తెలుగు వాళ్ళ గురించి ఆలోచించలేదు. మీకు కొత్తగా చెప్పేడి ఏముంది అని అన్నట్లు పొంనియన్ సాగుతుంది. అందుకే తెలుగు వాళ్ళు p s 2 కి నమస్తే పెట్టేసారు