Ponniyin Selvan 2 review: మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్-2 పాజిటివ్ టాక్ తెచ్చుకుంటోంది. శుక్రవారం థియేటర్స్‌లో రిలీజైన ఈ సినిమా ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యింది. పార్ట్-1 కంటే పార్ట్-2 బాగుందంటున్నారు ఫ్యాన్స్. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో రిలీజైన ఈ సినిమా అన్ని చోట్లా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటోంది.
పార్ట్ -1 మంచి హిట్ అవ్వడంతో పార్ట్-2 మీద మంచి హైప్ ఏర్పడింది. దీనికి తోడు సినిమాలో భారీ తారాగణం ఉండటం మరో ప్లస్ పాయింట్. ఇక కథ విషయానికొస్తే.. కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియిన్ సెల్వన్ నవలను అదే పేరుతో రెండు పార్ట్‌లుగా, సినిమాగా తీశాడు మణిరత్నం. ఫస్ట్ పార్ట్ వదిలేసిన చాలా ప్రశ్నలకు సెకండ్ పార్ట్‌లో సమాధానం చెప్పాడు. రాజ్యాన్ని హస్తగతం చేసుకునేందుకు చోళనాడు యువరాజు అరుణ్మోళి వర్మన్‌ను చంపాలనుకుంటారు. యువరాజును కాపాడే బాధ్యత వల్లభరాయన్ తీసుకుంటాడు. సముద్రంలో జరిగిన యుద్ధంలో అరుణ్మోళి వర్మన్ చనిపోయాతాడు. అరుణ్మోళి వర్మన్ మరణనానికి కరికాలన్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు..? అసలు నందిని చోళులపై ఎందుకు పగ పెంచుకుంది..? అదిత్య, కరికాలున్ని చంపి చోళనాడును ఎందుకు నాశనం చేయాలనుకుంది అనేది మిగతా కథ.
స్టోరీ బాగానే ఉన్నప్పటికీ చాలా ల్యాగ్ అనిపించిందంటున్నారు ఫ్యాన్స్. దానికి తోడు సినిమాలో చాలా క్యారెక్టర్స్ ఉండటం వాళ్ల పేర్లతో ఆడియన్స్ కాస్త కన్ఫ్యూజ్ అయ్యారు. పెద్దగా ట్విస్ట్‌లు లేకపోవడం, కథ సాఫీగా సాగిపోవడం కాస్త బోర్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాగుందంటున్నారు ఆడియన్స్. ఈ పాయింట్స్ మినహాయిస్తే అన్ని చోట్ల సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, రవివర్మ సినిమాటోగ్రఫీ సినిమాకు పెద్ద సపోర్ట్‌గా నిలిచాయి. మొత్తానికి పొన్నియిన్ సెల్వన్-2 మీద ఫ్యాన్స్ పెట్టుకున్న ఆశలను నిలబెట్టాడు డైరెక్టర్ మణిరత్నం.