ఇంతకీ విషయం ఏంటంటే ఒకప్పుడు.. పూజానే కావాలని వెంటపడిన హీరోలు.. దర్శకులు మొహం తిప్పేస్తున్నారు. వరుసగా నాలుగైదు ఫ్లాపులతో పేడౌట్ అయిపోయింది. ఇండస్ట్రీలో పూజా గురించి అందరూ ఇలాగే మాట్లాడుకుంటున్నారు. ఏడాది క్రితం ఓకె చేసిన సల్మాన్ మూవీ ‘కిసి కాభాయ్.. కిసి కిజాన్’.. ఆర్నెల్ల క్రితం ఓకె చేసిన మహేశ్ మూవీ తప్ప ఇంతవరకు మరో ఆఫర్ రాలేదు.
పూజా హెగ్డేకు సినిమాలు రావడం లేదన్న బాధ ఫ్యాన్స్‌లో వున్నా.. ఈ అమ్మడికి అలాంటిదేమీ లేదు. ఎందుకంటే.. ఒక సినిమాకు తీసుకునే రెమ్యునరేషన్ కంటే ఎక్కువే సంపాదిస్తోంది. సినిమాలు తగ్గడంతో.. ఈవెంట్స్‌పై ఫోకస్ చేసింది. వేదికపై డ్యాన్స్ చేసి కోట్లు వెనకేసుకుంటోంది. ఈవెంట్స్‌లో డ్యాన్స్ చేసే ఛాన్స్ వస్తే.. పూజా అసలు వదిలిపెట్టడం లేదు.
గత ఏడాది కేన్స్ వేదికలో రెడ్ కార్పెట్‌పై ఒయ్యారాలు ఒలకబోసింది. మొన్నటివరకు సినిమాలతో బిజీగా వుండడంతో.. ఈవెంట్స్‌పై తలెత్తి చూడలేదు. ప్రస్తుతం కావాల్సినంత టైం దొరకడంతో.. అవార్డుల ఫంక్షన్స్‌లో ఆడిపాడే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి సినిమాల్లేని లోటును తీర్చేసుకుంటోంది పూజా. ఏప్రిల్ 21న రిలీజ్ అవుతున్న ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ తర్వాత మహేశ్ సినిమా తప్ప మరో మూవీ వుండదు.
ఆర్నెల్ల నుంచి రాని ఆఫర్స్ ఇప్పుడు వస్తాయా? అంటే ఆ నమ్మకం ఈ అమ్మడికి కూడా లేదు. ఛాన్స్ రావాలేగానీ.. ఐటంసాంగ్ చేయడానికి రెడీ అంటున్నా.. భారీ రెమ్యునరేషన్ ఇచ్చి ఫ్లాప్ హీరోయిన్ని తీసుకోవడం ఎందుకన్న లెక్కల్లో వున్నారు దర్శకనిర్మాతలు. అసలు సమస్య ఏంటంటే పూజా ఇప్పటికి తన ఏక్షన్ ఇంప్రూవ్ చేసుకోవడం లేదు. లాంగ్ లెగ్స్ చూపించి నడిపించేస్తుందే తప్ప అక్కడ మేటర్ ఉండటం లేదు. అందుకే ఇండస్ట్రీలో పూజాని భరించడం కష్టం అంటున్నారు. ఇక పూజాని రిపేర్ చేసే బాధ్యత గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దే.