Pooja Hegde: 45 కోట్ల ఇంటితో వివాదం కొనితెచ్చుకున్న హీరోయిన్

పూజా చేతిలో సినిమాలు లేవు. పెద్దగా హిట్లు కాని, డిమాండ్ కాని లేదు. అలాంటప్పుడు తనకి అన్నికోట్లు విలువ చేసే ఫ్లాట్ ఎక్కడిది? అంత ఖరీదైన లగ్జరీ ఫ్లాట్ కొనేంత ఎమౌంట్ తనకెక్కడిది..? ఇప్పుడు ఇది అందరికి వస్తున్నడౌట్.

  • Written By:
  • Publish Date - April 15, 2024 / 07:39 PM IST

Pooja Hegde: పూజా హెగ్డే మంచి స్వింగ్‌లో ఉన్నప్పుడే సినిమాకు 4 నుంచి 6 కోట్లు తీసుకుంంది అన్నారు. అది కేవలం రెండేళ్ల క్రితం స్టోరీ. ఇప్పుడు కోటికి డిమాండ్ తగ్గినా ఆఫర్లు లేవు. ఏదో నాగచైతన్య సినిమా ఆఫర్ వచ్చింది. అలాగే హిందీలో షాహిద్ కపూర్‌తో దేవ అనే మూవీ చేస్తోంది. అయితే ఇప్పుడు తను వార్తల్లో ఎక్కడానికి కారణం 45 కోట్లతో ముంబైలో సీ ఫేస్ ఫ్లాట్ తీసుకోవటమే. 3 వేల స్క్వేర్ ఫీట్స్‌తో ఆ ఫ్లాట్ ఉందట.

Lokesh Kanagaraj: కొత్త యాంగిల్.. రాఘవ లారెన్స్‌తో లోకేష్ కనగరాజ్..

పూజా చేతిలో సినిమాలు లేవు. పెద్దగా హిట్లు కాని, డిమాండ్ కాని లేదు. అలాంటప్పుడు తనకి అన్నికోట్లు విలువ చేసే ఫ్లాట్ ఎక్కడిది? అంత ఖరీదైన లగ్జరీ ఫ్లాట్ కొనేంత ఎమౌంట్ తనకెక్కడిది..? ఇప్పుడు ఇది అందరికి వస్తున్నడౌట్. అయితే తను గత 12 ఏళ్లలో 20 సినిమాలు చేస్తే.. అందులో మొహేంజోదారో వరకు కనీసం కోటి కూడా తీసుకోలేదు. రంగస్థలం, ఎఫ్ 3లో ఐటమ్ సాంగ్స్‌కే కే పరిమితమైంది. ఇలా లెక్కేస్తే తను 4 కోట్ల పైనే పారితోషికం తీసుకున్న మూవీల సంఖ్య పది దాటట్లేదు. అలా లెక్కేసినా 40 కోట్ల పారితోషికం రావటమే గొప్ప.

అలాంటిది 45 కోట్ల విలువైన లగ్జరీ అపార్ట్ మెంట్ ఎలా తీసుకుందంటే.. యాడ్ ఎండోర్స్‌మెంట్‌లు, ఇన్‌స్టా ప్రమోషన్లే కారణం అంటున్నారు. అలా తను సంపాదించిందని కవర్ చేస్తున్నారు. కాని 45 కోట్ల ఫ్లాట్ తీసుకున్న తర్వాతే తను ఇన్‌కమ్‌ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఫోకస్‌లో పడిందట. కొత్త ఇంటి మీద సోదా జరిగిందట