Pooja Hegde: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజెంట్ పాలిటిక్స్ వల్ల సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చాడు. ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరి హర వీరమల్లు పెండింగ్ షూటింగ్స్ వచ్చే ఏడాది మార్చ్ తర్వాతే ఉండొచ్చని తెలుస్తోంది. అంతవరకు బానే ఉంది కాని, తన మూవీని ముందు కాదన్న పూజా హెగ్డే, తర్వాత మళ్లీ తానే వచ్చి చేస్తానంటే పవన్ నుంచి హరీష్ శంకర్ వరకు అంతా గెంటేశారు. ఫలితంగా గుంటూరు కారం నుంచి కూడా గెంటేసే పరిస్థితి వచ్చింది. దీనంతటికి కారణం కర్మ.
Devara: వేట మొదలు.. దేవర టీజర్ డేట్ ఫిక్స్..!
కాలం కలిసొచ్చినప్పుడు కన్నూ మిన్నంటకుండా ఉంటే ఇలానే జరుగుతుందంటారు. సడన్‌గా ఎప్పుడో జరిగిపోయిన ఈ అంశం ఇప్పుడు మళ్లీ తెరమీదకు రావటానికి కారణం నానితో తను జోడీకట్టబోతోందన్న వార్త వచ్చిన కొన్ని గంటల్లోనే ఆ ప్రాజెక్టే ఆగిపోవటం. క్యా సీన్ హై.. కిస్మత్ కర్మకాలితే ఇలానే ఉంటుందంటారు. పవర్ స్టార్ లాంటి హీరోకి డేట్లిచ్చి వెనక్కి తీసుకున్న ఈ లేడీకి వరుసగా ఫ్లాపులు పడటం, తర్వాత గుంటూరు కారం మూవీలోంచి బయటికి వెళ్లాల్సి రావటం కట్ చేస్తే మీడియం రేంజ్ హీరోలు కూడా తనని పక్కకుపెట్టడం చాలా విచిత్రం.
పూజా హెగ్డేతో గతంలో జోడీ కట్టిన నాగచైతన్య కూడా తన తండెల్ మూవీకి ముందు పూజా హగ్డేకే సై అన్నాడు. తర్వాత తనని కాదని సాయి పల్లవికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇప్పుడు కొత్తగా నానితో తమిళ దర్శకుడు ప్లాన్ చేసిన మూవీలో పూజాహెగ్డే హీరోయిన్ అనుకున్నారో లేదో.. అది కాస్త అటకెక్కింది. పూజా హెగ్డే కిస్మత్ ఈరేంజ్ లో తనకి పంచ్ ఇస్తోంది.