Poonam Kaur: వాడొక బ్రోకర్‌.. త్రివిక్రమ్‌పై విరుచుకుపడిన పూనమ్‌..

జనసేన అధినేత పవన్‌, డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ టార్గెట్‌గా.. పూనమ్‌ చేసే ట్వీట్‌లు రచ్చ రేపుతుంటాయ్. గతంలో పవన్‌ కల్యాణ్ మీద విమర్శలు చేస్తూ.. ఆమె రాసుకొచ్చిన రాతలు ఎంత వైరల్ అయ్యాయో తెలిసిందే. ఇక గురూజీ అంటూ.. పూనమ్‌ చేసే ట్వీట్లు ఎప్పుడూ చర్చకు దారి తీస్తుంటాయ్.

  • Written By:
  • Publish Date - February 22, 2024 / 03:31 PM IST

Poonam Kaur: చేతిలో సినిమాలు తగ్గిపోయాక.. వివాదాలతో లైమ్‌లైట్‌లో ఉంటోంది హీరోయిన్‌ పూనమ్‌కౌర్‌. ఆమే చేసే ట్వీట్లు.. రిలీజ్‌ చేసే ఆడియోలు.. ఎంతటి రచ్చకు కారణం అవుతాయో.. ఎలాంటి వివాదాలకు దారి తీస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయాల మీద కూడా అప్పుడప్పుడు ట్వీటుతూ.. కాంట్రవర్సీకి కేరాఫ్ అవుతుంటుంది పూనమ్. ఇదంతా ఎలా ఉన్నా.. జనసేన అధినేత పవన్‌, డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ టార్గెట్‌గా.. పూనమ్‌ చేసే ట్వీట్‌లు రచ్చ రేపుతుంటాయ్. గతంలో పవన్‌ కల్యాణ్ మీద విమర్శలు చేస్తూ.. ఆమె రాసుకొచ్చిన రాతలు ఎంత వైరల్ అయ్యాయో తెలిసిందే. ఇక గురూజీ అంటూ.. పూనమ్‌ చేసే ట్వీట్లు ఎప్పుడూ చర్చకు దారి తీస్తుంటాయ్.

Upasana Kamineni: ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. రెండో బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధంగా ఉన్నా..!

అసలు పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్‌తో పూనమ్ కౌర్‌కు ఉన్న గొడవ ఏంటి అనే దానిపై ఇప్పటికీ క్లారిటీ లేకపోయినా.. ఆ ఇద్దరి మీద మాత్రం అమ్మడు ఓ రేంజ్‌లో రగిలిపోతూ ఉంటుంది. ఇప్పుడు మళ్లీ అలాంటి ట్వీటే చేసింది. ఎప్పుడు గురూజీ అంటూ పరోక్షంగా కామెంట్లు చేసే పూనమ్‌.. ఇప్పుడు ఏకంగా పేరు చెప్పి మరీ ఘాటుగా పోస్ట్ పెట్టింది. త్రివిక్రమ్‌ను తిట్టిపోస్తూనే.. దానికి పవన్ కల్యాణ్ కామెంట్లు యాడ్ చేసింది. ఈ మధ్య పవన్ కల్యాణ్‌ తన రాజకీయ ప్రసంగంలో.. త్రివిక్రమ్ గురించి ప్రస్తావించాడు. తనకు పులి, సింహం అంటూ డైలాగ్స్ చెప్పడం అంతగా ఇష్టం ఉండదని.. అత్తారింటికి దారేది సినిమాలో సింహం గడ్డం గీసుకోదు.. నేను గీసుకుంటాను అనే డైలాగ్‌ను చెప్పడానికి ఇబ్బంది పడ్డానని.. దీంతో త్రివిక్రమ్ కామెడీగా చెప్పండని అన్నారని గుర్తు చేసుకున్నారు. కామెడీగా అయితే ఏదైనా చెప్పేస్తాను అంటూ.. ఆ సినిమా రోజులు గుర్తు చేసుకున్నాడు పవన్‌. ఈ వీడియోను ఓ మీడియా సంస్థ ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా.. దానికి పూనమ్ స్ట్రాంగ్‌ రిప్లయ్‌ ఇచ్చింది.

యూజ్ లెస్ ఫెల్లో అంటూ త్రివిక్రమ్ పేరు పెట్టేసింది. దీంతో అంతా షాక్ అవుతున్నారు. మొదటిసారి ఇలా నేరుగా ఓ పేరు పెట్టి ట్వీట్ వేశావ్.. అని నెటిజన్లు కామెంట్లు చేశారు. దీంతో పెద్ద చర్చ మొదలై.. అది కాస్త వైరల్ అవుతోంది. ఈ కాంట్రవర్సీ ఎక్కడికి దారితీస్తుందన్నది హాట్‌టాపిక్‌గా మారింది. కత్తి మహేష్ బతికి ఉన్న రోజుల్లో.. అతనితో కలిసి పవన్‌, త్రివిక్రమ్ మీద పూనమ్‌ చేసిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. ఆ టైంలోనే పూనమ్ ఆడియో ఒకటి లీక్ కావడం సెన్సేషన్‌గా మారింది. ఐతే ఇంతవరకు తనకు జరిగిన అన్యాయం గురించి బయటకు చెప్పుకోని పూనమ్‌.. ఇలా టైమ్ దొరికినప్పుడల్లా పవన్‌ను, త్రివిక్రమ్‌ను సోషల్‌ మీడియాలో ఆడేసుకుంటోంది.