Poonam Pandey: సర్వైకల్ క్యాన్సర్‌తో మరణించినట్లు చెబుతున్న నటి, మోడల్ పూనమ్ పాండే షాకిచ్చింది. తాను బతికే ఉన్నానని చెప్పింది. దీంతో నెటిజన్లు షాకవుతున్నారు. ఆమె చేసిన పనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా.. ఒక విషయంపై అవగాహన కల్పించడం కోసమే ఈ పని చేసిందని కొందరు ఆమెను అభినందిస్తున్నారు.
LK Advani, Bharat Ratnam : ఎల్ కే అద్వానీకి భారత అత్యున్నత పౌర పురస్కారం.. (భారత రత్న)
వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన నటి కమ్ మోడల్ పూనమ్ పాండే. కాంట్రవర్సీ వ్యాఖ్యలతో, పొదుపుగా దుస్తులు ధరిస్తూ.. ఎప్పుడూ నెట్టింట్లో ట్రెండ్ అవుతూ ఉండే ఈమె మరణ వార్త కూడా అదే సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతుంది. పూనమ్ గర్భాశయ క్యాన్సర్‌తో మృతి చెందినట్లు నటి ఇన్‌స్టా ఖాతా ద్వారా వెల్లడించింది ఆమె టీం. అయితే పూనమ్ మరణ వార్త రాగానే సెలబ్రిటీలు షాక్‌కు గురై.. రెస్ట్ ఇన్ పీస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ నెటిజన్లు మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమె అకౌంట్ హ్యాక్ అయ్యి ఉంటుందని, ఇది ఫేక్, ఫన్ పోస్టు అని, ఇదొక స్టంట్ అంటూ కొట్టిపారేస్తున్నారు. మొన్నటి వరకు ఆమె బాగానే ఉంది కదా.. ఇప్పుడేంటీ ఇంత సడెన్‌గా.. అంటూ పూనమ్ బతికే ఉందంటున్నారు. అయితే పూనమ్ మృతదేహం కానీ, ఇతర వివరాలు కానీ.. ఆమె భౌతిక కాయానికి నివాళులు అర్పించినట్లుగానీ ఎవ్వరూ చెప్పకపోవడంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి.
అయితే గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. ఇంతకు పూనమ్ అప్పుడేమందంటే.. ‘త్వరలో ఓ పెద్ద వార్త మీ ముందుకు రాబోతుంది. ప్రజలను సర్‌ప్రైజ్ చేయడమంటే నాకెంతో ఇష్టం. నేను మారాను అని ప్రజలు భావించినప్పుడు వారిని మరింత ఆశ్చర్యపరచడానికి ఇష్టపడతాను. కాబట్టి.. అతి పెద్ద వార్త వస్తుంది’ అంటూ వ్యాఖ్యానించింది. ఈ కాంట్రవర్సీ క్వీన్ అన్నట్లుగానే అందరిని ఫూల్స్‌ని చేసినట్లు తెలుస్తోంది. పూనమ్ చనిపోయిందని వార్త రాగానే అందరూ షాక్ కు గురయ్యారు. ఆమె సన్నిహితులు సైతం దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు ఇది ఫేక్ అని తేలిపోయింది. పూనమ్ రెండు వీడియోలతో సడెన్ ఎంట్రీ ఇచ్చింది. ఆమె బతికే ఉన్నట్లు ఓ వీడియో చేసింది. గర్భాశయ క్యాన్సర్ అవగాహనా ప్రచారం కోసం ఇలాంటి ప్రయోగం చేసినట్లు తన ఇన్ స్టా ఖాతా ద్వారా వీడియోలను పోస్టు చేసింది ఈ కాంట్రవర్సీ క్వీన్. గర్భాశయ క్యాన్సర్ బారిన పడలేదు. కానీ ఈ వ్యాధిని ఎలా ఎదుర్కోవాలో తెలియజేయడానికి ఇలా చేసినట్లు చెప్పుకొచ్చింది. HPV వ్యాక్సిన్ మరియు ముందస్తుగా గుర్తించే పరీక్షల ద్వారా గుర్తించవచ్చని తెలిపింది ఈ బోల్డ్ బ్యూట . అంతేకాక తను చేసిన పనికి అందరికి క్షపణాలు తెలిపింది.