పోట్టేల్ రివ్యూ… రంగస్థలం రేంజ్

ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్ అవుతున్నాయి. ఇటీవల వచ్చిన మత్తు వదలరా టూ సూపర్ హిట్ కాకపోయినా... బ్యాడ్ టాక్ అయితే రాలేదు. ఇప్పుడు మళ్ళీ పోట్టేల్ అనే సినిమా థియేటర్లలో సందడి చేయడం మొదలుపెట్టింది.

  • Written By:
  • Publish Date - October 25, 2024 / 03:47 PM IST

ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్ అవుతున్నాయి. ఇటీవల వచ్చిన మత్తు వదలరా టూ సూపర్ హిట్ కాకపోయినా… బ్యాడ్ టాక్ అయితే రాలేదు. ఇప్పుడు మళ్ళీ పోట్టేల్ అనే సినిమా థియేటర్లలో సందడి చేయడం మొదలుపెట్టింది. సినిమాకు చాలా మంచి టాక్ వచ్చింది. ఏ మాత్రం అంచనాలు లేకపోయినా ప్రమోషన్స్ తో సినిమాను జనాల్లోకి తీసుకెళ్ళారు. ముఖ్యంగా అనన్య నాగళ్ల సినిమాను బాగా ప్రమోట్ చేసారు సోషల్ మీడియాలో. అసలు ఈ సినిమా ఎలా ఉంది ఏంటీ అనేది ఒక్కసారి చూద్దాం.

సాహిత్‌ మోత్కురి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో అనన్యా నాగళ్ల తదితరులు నటించారు. యువ చంద్ర, అజయ్‌, నోయల్‌, శ్రీకాంత్‌ అయ్యంగర్‌, ప్రియాంక శర్మ తదితరులు నటించారు. సినిమా చూసిన వాళ్ళు అయితే విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ మూవీ… రంగస్థలం తర్వాత ఆ రేంజ్ లో ఉందని కామెంట్స్ చేస్తున్నారు. మహారాష్ట్ర, తెలంగాణ బార్డర్‌ ప్రాంతంలోని విధర్భ సమీపంలో గుర్రంగట్టు గ్రామీణ ప్రాంతంలో సినిమాను షూట్ చేసారు. ఆ గ్రామ దేవత బాలమ్మకు పుష్కరానికి ఓసారి జాతర చేసి పొట్టేలును బలిస్తారు… అలా సినిమా కథ మొదలవుతోంది.

గ్రామ దేవత ఆ ఊరికి పెత్తందారుగా ఉన్న పటేల్‌కు పూనుతుందని జనాలు బలంగా నమ్ముతారు. పటేల్‌ (అజయ్‌) ఒంటి మీదకు బాలమ్మ రాకపోవడంతో గ్రామంలో నీరు లేక, కరువు కాటకాలతో ఇబ్బంది పడుతున్న అక్కడి జనాలకు ఏం చేయాలో దిక్కుతోచక ఉన్న గ్రామ ప్రజలను… తనకు గ్రామ దేవత పూనినట్టుగా అజయ్ నాటకం ఆడతాడు. బాలమ్మకు సమర్పించాల్సిన పొట్టేల్‌ కాపరిగా ఉన్న పెద్ద గంగాధర్‌ కు ఆ విషయం తెలిసినా ఎవరూ నమ్మరు. గ్రామంలో ఒక నియంతగా వ్యవహరించే పటేల్ కు ఎదురు వెళ్లి తన కూతుర్ని గంగాధర్ చదివిస్తాడు.

జాతర టైంకి పొట్టేల్‌ను తీసుకు రావాలని లేదంటే తన కూతురుని బాలమ్మకు బలి ఇవ్వాలని పటేల్‌ ఆదేశిస్తాడు. ఆ పొట్టేల్‌ కోసం గంగాధర్‌ ఏం చేసాడు… అక్కడి నుంచి కథ ఎలా ఉంది అనేది అంతా ఆసక్తికరంగానే ఉంటుంది. 1980 సమయంలో పటేళ్ల వ్యవస్థ, వాళ్ల ముందు తల కూడా ఎత్తకుండా ఎలా బ్రతికే వారో ఈ సినిమాలో అలాగే చూపిస్తారు. కచ్చితంగా సినిమా ఎక్కడా బోర్ కొట్టలేదు. సెకెండాఫ్‌ సినిమా చాలా బాగా నచ్చగా క్లైమాక్స్ మాత్రం పీక్స్ లో ఉంటుంది. కమర్షియల్‌ హంగులు లేకుండా కేవలం కథలో ఉన్న బలాన్ని నమ్ముకుని తీసిన ఈ సినిమాలో నటులు అందరూ చాలా బాగా ప్రభావం చూపించారు. నెగటివ్ రోల్ లో అజయ్ చాలా బాగా ఆకట్టుకున్నాడు. కచ్చితంగా ఈ సినిమా మంచి వసూళ్లు సాధిస్తుంది.