వీడియో ఓపెన్ చేయగానే ఏం చూస్తున్నావ్ నువ్ అనే వాయిస్ వినిపించగా.. ఫైర్ స్టార్మ్ అంటే నిప్పు తుఫాన్ అంటూ మొదలైన బీజీఎం.. గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. జపనీస్ ట్రెడిషన్‌తో ప్లే అయ్యే బ్యాగ్రౌండ్ స్కోర్‌తో ఓపెన్ చేస్తూ.. డైరెక్టర్ సుజీత్ క్లైమాక్స్ 14 పేపర్ విసరడంతో వీడియో స్టార్ట్ అవుతుంది. రివాల్వర్ ఆపరేట్ చేయడం, గ్రనైడ్ తిప్పడం, కత్తితో కాసేపు అలా ఆడించడం.. ఓజీ మీద అంచనాలు పెంచేస్తోంది.
జపాన్ మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో సినిమా తెరకెక్కనుంది క్లియర్‌గా అర్థం అవుతోంది. గ్యాంగ్‌స్టర్‌లకే గ్యాంగ్‌స్టర్.. పవన్ ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అనే కథ చుట్టూ సినిమా తిరగడం ఖాయం. ఐతే ఎలాంటి ట్విస్టులు ఉంటాయన్నదే ఇప్పుడు ఇంట్రస్టింగ్. ఎన్ని వెపన్స్ ఉన్నా.. డైరెక్టర్ తిప్పిన కత్తి మాత్రం కేకపుట్టిస్తోంది. స్టోరీకి, కత్తికి కీ కనెక్షన్ ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. క్లైమాక్స్ వర్షన్‌లు మొత్తం 16రాసుకొని.. 14వది ఫైనల్ చేసినట్లు.. గ్లింప్స్‌లో చెప్పారు. సినిమా రేంజ్ ఏంటో చెప్పడానికి ఇది చాలు.
షాడో షాట్ అయితే మరింత కేక పుట్టించింది. డాన్ సీట్‌లో.. ఎవరికో వార్నింగ్ ఇస్తున్నట్లు, రూల్ చేస్తున్నట్లు కనిపించిన ఆ షాట్‌లో పవన్‌ను ఊహించుకుంటే.. పూనకాలు లోడింగ్ అనిపిస్తోంది. ఈ వీడియోలో పవర్ స్టార్ కనిపించకపోయినా.. ఆ కళ్లు గ్లింప్స్ అంతా పవర్ క్యారీ అయ్యేలా చేసింది. ఈ మధ్య పవన్ వరుసగా రీమేక్స్ చేస్తున్నాడు. ఓజీ మాత్రం పక్కా ఒరిజినల్ స్టోరీ. అందులోనూ పాన్ ఇండియా మూవీ. దీంతో ఫ్యాన్స్ అంచనాలకు హద్దే లేకుండా పోయింది. సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా.. థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ ఏడాది నవంబర్ 14కు విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.