Power Star: నటనలో 27 ఏళ్లు.. రాజకీయాల్లో 10 ఏళ్లు.. ఇదే పవన్‌ కళ్యాణ్‌ సినీ,రాజకీయ ప్రయాణం

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌. స్క్రీన్‌ మీద మనిషి కనిపించకపోయినా.. ఈ పేరు కనిపిస్తే చాలు పూనకాలు వచ్చినట్టు ఊగిపోతుంటారు ఫ్యాన్స్‌. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది మెగాస్టార్‌ తమ్ముడిగానే అయినా.. ఆయన ఎంట్రీ తరువాత సీన్‌ మారిపోయింది.

  • Written By:
  • Updated On - March 12, 2023 / 12:20 PM IST

పవన్‌ కళ్యాణ్‌కు ఫ్యాన్స్‌ ఉండరు.. భక్తులు మాత్రమే ఉంటారు. ఇది ఆయన గురించి ఫ్యాన్స్‌ గర్వంగా చెప్పుకునే విషయం. 1996లో అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయం అయ్యారు పవన్‌ కళ్యాణ్. మొదటి సినిమాతోనే మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్నారు. సినిమాకు యావరేజ్‌ టాక్‌ వచ్చినా.. పవన్‌ పర్ఫార్మెన్స్‌కు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఆ తరువాత వచ్చిన గోకులంలో సీత సుస్వాగతం సినిమాలు హిట్‌గా నిలిచినా.. తొలిప్రేమ సినిమా పవన్‌ కళ్యాణ్‌ను స్టార్‌ మార్చింది. అప్పటి నుంచి ఇక పవన్‌ కళ్యాణ్ తిరుగులేని హీరోగా ఎదిగారు. ఎంత ఎదిగారంటే.. ఏకంగా 10 వరుస ఫ్లాప్‌లు వచ్చినా ఆయన ఫ్యాన్‌ బేస్‌ మాత్రం ఇంచు కూడా తగ్గలేదు. ఖుషీ సినిమా తరువాత చాలా ఏళ్లపాటు పవన్‌ కళ్యాన్‌కు హిట్‌ లేదు.

జానీ మొదలు పంజా వరకూ అన్నీ ఫ్లాపులే. హరీష్‌ శంకర్‌ డైరెక్షన్‌లో వచ్చిన గబ్బర్‌ సింగ్‌ సినిమాతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను అందకుకన్నారు పవర్‌ స్టార్‌ అప్పటి. ఆ తరువాత కొన్ని హిట్స్‌, కొన్ని ఫ్లాప్స్‌, కొన్ని యావరేజ్‌ టాక్స్‌తో సినీ ప్రయానాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా నాలుగు సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. ముందు నుంచీ సామాజిక అంశాలపై మంచి ఇట్రస్ట్‌ ఉన్న పవన్‌ కళ్యాణ్‌.. రాజకీయాల్లో కూడా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. చిరంజీవి ప్రారంభించిన ప్రజారాజ్యం పార్టీలో యూత్‌ లీడర్‌గా పని చేశారు.

ఆ అనుభవంతో 2014 మార్చ్‌ 14న జనసేన పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. వచ్చీ రావడంతో ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన పద్ధతి తనకు నచ్చలేదంటూ ప్రభుత్వంపై వ్యతిరేక గళం వినిపించారు. అప్పటి నుంచి ఇటు సినిమాలు, అటు రాజకీయాలు సమానంగా బ్యాలెన్స్‌ చేస్తున్నారు పవన్‌ కళ్యాణ్‌. పార్టీ పెట్టిన కొత్తలో ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీకి మద్దతిచ్చారు. ఆ తరువా ఆ పార్టీతో విభేదించి ఒంటరిగా పోటీ చేశారు. కానీ ఆయన పార్టీ ఘోర పరాజయంపాలైంది. కానీ పవన్‌ కళ్యాణ్‌ మాత్రం తన హోప్‌ కోల్పోలేదు. అధికారం ఉన్నా లేకపోయినా తాను ప్రజల మధ్యే ఉంటానంటూ ప్రకటించాడు.

పొద్దున షూటింగ్‌లో పాల్గొని.. సాయంత్రం ప్రజల్లో తిరిగిన రోజులు కూడా ఉన్నాయంటే పబ్లిక్‌ సర్వీస్‌లో ఆయనకు ఉన్న కమిట్‌మెంట్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇంట్లో జరిగే ఫంక్షన్‌కు ఆయినా వెళ్లకుండా ఉంటారు కావచ్చు.. కానీ నమ్ముకున్న వాళ్లు కష్టం అంటే చాలు.. రెక్కలు కట్టుకుని వాలిపోతారు జనసేనాని. ఆ కమిట్‌మెంటే ఆయనకు ప్రజల్లో రాజకీయంగా ఆధరణ పెంచింది. ప్రభుత్వంతో విసిగిపోయిన ప్రతీ ఒక్కరికీ ఆయనే ఇక హోప్‌ అనేలా చేసింది. ఇప్పుడు ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా దానికి పవన్‌ కళ్యాణ్‌ సపోర్ట్‌ కావాల్సిందే. ఇటు సినిమాల్లో, అటు రాజకీయాల్లో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న పవన్‌ కళ్యాణ్‌ సినిమాల్లోకి వచ్చి 27 ఏళ్లు గడిచింది అలాగే రాజకీయాల్లోకి వచ్చి 10 ఏళ్లు గడిచింది. ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ సన్నిహితులు, సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. త్వరలోనే పవన్‌ కళ్యాణ్‌ తన టార్గెట్‌ రీచ్‌ అవ్వాలని విష్‌ చేస్తున్నారు.