రక్తంతో రాసిన చరిత్ర ఇది.. సిరా చుక్కలతో ముందుకు సాగదు.. రక్తాన్నే కోరుకుంటుంది..

డార్లింగ్‌ ప్రభాస్‌ జీవితాన్ని ఓ రేంజ్‌లో టర్న్‌ చేసిన సినిమా బాహుబలి. రెండు పార్ట్‌లుగా రిలీజ్‌ అయిన ఈ సినిమా.. భారత సినీ చరిత్రలో ఓ కొత్త అధ్యాయం. పేరుకు రెట్రో కథే అయినా.. ఓ యాక్షన్‌ సినిమాలో ఉన్న అన్ని ఎలిమెంట్స్‌ బాహుబలి సినిమాలో ఉంటాయి. మోసం, ప్రేమ, యుద్ధం, త్యాగం వీటన్నిటీ కలయికే బాహుబలి సినిమా.

  • Written By:
  • Publish Date - June 18, 2023 / 02:52 PM IST

సింపుల్‌గా చెప్పాలంటే ఇది రక్తంతో రాసిన కథ. ప్రభాస్‌ యాక్షన్‌ కటౌట్‌కు ఈ సినిమా అద్భుతంగా సెట్‌ అయ్యింది. అందుకే ఆ రేంజ్‌లో రికార్డ్స్‌ క్రియేట్‌ చేసింది. కానీ ఆ తరువాత వచ్చిన సాహో, రాధేశ్యామ్‌ సినిమాలు డిజాస్టర్‌గా నిలిచాయి. రీసెంట్‌గా వచ్చిన ఆదిపురుష్‌ కలెక్షన్ల పరంగా బాగానే ఉన్నా ఆడియన్స్‌ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కుంటోంది. వరుస వివాదాల్లో చిక్కుకుంటోంది. ఒక రకంగా చూస్తే ప్రభాస్‌ ఖాతాలో ఆదిపురుష్‌ సినిమా ఇంకో డిజాస్టర్‌ అనే చెప్పాలి. ఇప్పుడు ప్రభాస్‌ను గట్టెక్కించాలంటే.. అదిరిపోయే కంబ్యాక్‌ ఇవ్వాలంటే ఉన్న ఒకే ఒక్క ఆప్షన్‌ సలార్‌.

ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్‌ ఫుల్‌ యాక్షన్‌ మోడ్‌లో కనిపించబోతున్నాడు. కేజీఎఫ్‌లో యష్‌ని ఎలా చూపించాడో సలార్‌లో ప్రభాస్‌ను కూడా అదే రేంజ్‌లో ఎలివేట్‌ చేయబోతున్నాడు ప్రశాంత్‌ నీల్‌. ప్రభాస్‌ కటౌట్‌కు ప్రశాంత్‌ నీల్‌ ఎలివేషన్‌ తోడైతే ఆ విజువల్‌ ఏ రేంజ్‌లో ఉంటుందో మీరే ఊహించుకోండి. అప్పుడు బాహుబలి తరువాత మళ్లీ ప్రభాస్‌ భీకరంగా కనిపించబోయే సినిమా సలార్‌ మాత్రమే. సింపుల్‌గా చెప్పాలంటే రక్తంతో రాసిన బాహుబలి సినిమా రికార్డ్స్‌ను తిరగరాయలంటే మళ్లీ రక్తమే చిందించాలి అది సలార్‌తోనే సాధ్యం. దీంతో ఇప్పుడు ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఆశలు మొత్తం సలార్‌ సినిమా మీదే ఉన్నాయి. కలెక్షన్స్‌లో ఆదిపురుష్‌ సినిమా బాహుబలి రికార్డ్స్‌ కొల్లగొట్టినా ఆడియన్స్‌ మనసుల్లో ప్లేస్‌ సంపాదించలేకపోయింది. సలార్‌తో ఆ స్థానాన్ని ప్రభాస్‌ భర్తీ చేస్తాడో లేదో చూడాలి.