PRABHAS-ALLU ARJUN: ప్రభాస్, బన్నీ పేరు చెబితే వణికిపోతున్న డిస్ట్రిబ్యూటర్లు.. కారణం ఇదే..!

నైజాం, ఆంధ్రా డిస్ట్రిబ్యూటర్లకు ప్రభాస్, బన్నీ పేరు చెబితే భయపడటానికి రీజనుంది. సలార్ హిట్ అవ్వటమే కాదు, నైజాంతోపాటు యూఎస్‌లో రైట్స్ కొన్న డిస్ట్రిబ్యూటర్లకి కాసుల పండగ వచ్చింది. పుష్ప రైట్స్ కొన్న నైజాం, ఆంధ్రా డిస్ట్రిబ్యూటర్లకు ఇలానే లాభాల పంట పండింది.

  • Written By:
  • Publish Date - March 12, 2024 / 03:21 PM IST

PRABHAS-ALLU ARJUN: రెబల్ స్టార్ ప్రభాస్ పేరు చెప్పగానే బాక్సాఫీస్‌లో కాసలు వర్షం కురుస్తుంది. అలాంటి ఈ స్టార్‌ని చూస్తే డిస్ట్రిబ్యూటర్లు వణికిపోతున్నారు. అచ్చంగా అల్లు అర్జున్ పేరు చెప్పినా కాని నైజాం, ఆంధ్రా డిస్ట్రిబ్యూటర్లకు షివరింగ్ వచ్చేస్తోంది. బేసిగ్గా ఓ హీరో సినిమా వచ్చి ఫ్లాపైతే దాని వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు, ఆ హీరో పేరు చెబితే భయపడ్డం కామన్. కాని విచిత్రంగా హిట్ ఇచ్చాడని ప్రభాస్, బ్లాక్ బస్టర్ ఇచ్చాడని బన్నీని చూసి భయపడే పరిస్తితి రావటమే వెరైటీ.

JANASENA SEATS : చివరకు మిగిలింది 21

నిజంగానే నైజాం, ఆంధ్రా డిస్ట్రిబ్యూటర్లకు ప్రభాస్, బన్నీ పేరు చెబితే భయపడటానికి రీజనుంది. సలార్ హిట్ అవ్వటమే కాదు, నైజాంతోపాటు యూఎస్‌లో రైట్స్ కొన్న డిస్ట్రిబ్యూటర్లకి కాసుల పండగ వచ్చింది. పుష్ప రైట్స్ కొన్న నైజాం, ఆంధ్రా డిస్ట్రిబ్యూటర్లకు ఇలానే లాభాల పంట పండింది. అలాంటప్పుడు ఈ హీరోల పేరు చెబితే డిస్ట్రిబ్యూటర్లు సంతోషపడాలి కాని భయపడుతున్నారు. కారణం సలార్ 2 రైట్స్ కొనాలాంటే ఏం అమ్ముకోవాలా అని. పుష్ప 2 రైట్స్ కోసం వందకోట్ల పైనే సమర్పించుకోవాల్సి వస్తే ఎలా అన్నదే డిస్ట్రిబ్యూటర్ల సమస్య. యావరేజ్ టాక్‌తో వచ్చిన సలారే 700 కోట్లు రాబట్టింది. ఇక కల్కి, సలార్2 వస్తే సినీ సునామే. అందుకే నిర్మాతలు నైజాం, ఆంధ్రా.. ఇలా ఏ ఏరియా రైట్స్ అయినా 100 కోట్ల నుంచి 130 కోట్ల వరకు కోట్ చేస్తున్నారట.

పుష్ప 2 రూ.500 కోట్లతో తీస్తున్నారంటే నైజాం 150 కోట్లు, ఆంధ్ర 160 కోట్లు ఇస్తే కాని డిస్ట్రిబ్యూషన్ రైట్స్ వచ్చే ఛాన్స్ ఉండదట. అంత పెట్టినా లాభాలు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి క్యూలైన్ పెరిగే ఛాన్స్ ఉంది. కాని అంత ఎమౌంట్ ఎక్కడి నుంచి తీసుకురావాలో అర్ధంకాక డిస్ట్రిబ్యూటర్లలో ఇప్పుడే ఫీవర్ మొదలైనట్టుంది.