SALAAR: జస్ట్ మిస్.. ‘సలార్‘లో వరద పాత్ర గోపీచంద్ చేసి ఉంటేనా..

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'సలార్'. శత్రువులుగా మారిన ఇద్దరు స్నేహితుల కథగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో వరద పాత్రలో పృథ్వీరాజ్‌కి బదులుగా గోపీచంద్ నటిస్తే ఎలా ఉండేదన్న ఆలోచన ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

  • Written By:
  • Publish Date - December 18, 2023 / 04:09 PM IST

SALAAR: టాలీవుడ్ హీరోలలో బెస్ట్ ఫ్రెండ్స్ అంటే గుర్తుకొచ్చే వారిలో ప్రభాస్, గోపీచంద్ ముందు వరుసలో ఉంటారు. ఎప్పుడో 20 ఏళ్ళ క్రితం మొదలైంది వీరి స్నేహం. ఒకరి విజయాన్ని చూసి మరొకరు సంతోషించే అంత గొప్ప స్నేహం వీరిది. అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ప్రభాస్, గోపీచంద్ స్నేహాన్ని చూసి ముచ్చట పడుతుంటారు. వీరి కలయికలో సినిమాలు రావాలని కోరుకునే వారు ఎందరో ఉన్నారు. ఎప్పుడో 20 ఏళ్ళ క్రితం ‘వర్షం’ సినిమాలో వీరు కలిసి నటించారు. ప్రభాస్ హీరోగా నటించగా, గోపీచంద్ విలన్‌గా నటించాడు.

SALAAR: మాస్ కా స్వాగ్‌.. కాన్సార్‌ ఎరుపెక్కాలా.. బాక్సాఫీస్‌ బద్ధలవ్వాల్సిందే..

ఆ తర్వాత వీరి కలయికలో సినిమా రాలేదు. అయితే ఈమధ్య కాలంలో గోపీచంద్ ప్రతిభకు తగ్గ పాత్రలు రావట్లేదని, ఏదైనా మూవీలో ప్రభాస్‌ని ఢీ కొట్టే పవర్ ఫుల్ విలన్ రోల్‌లో గోపీచంద్ నటిస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు. దర్శకులు ఆ దిశగా ఆలోచిస్తే బాగుంటుందని వారు కోరుకుంటున్నారు. అయితే ఇప్పుడు ‘సలార్’ రూపంలో అలాంటి మంచి అవకాశం మిస్ అయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘సలార్’. శత్రువులుగా మారిన ఇద్దరు స్నేహితుల కథగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో దేవ అలియాస్ సలార్‌గా ప్రభాస్, వరదగా పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనున్నారు. అయితే వరద పాత్రలో పృథ్వీరాజ్‌కి బదులుగా గోపీచంద్ నటిస్తే ఎలా ఉండేదన్న ఆలోచన ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇటీవల ‘సలార్’ నుంచి దేవ-వరద మధ్య స్నేహం నేపథ్యంలో సాగే ‘సూరీడే’ అనే పాటను విడుదల చేశారు.

Srileela  : శ్రీలీల MBBS చదువుకోండి ఫస్టు

అందులో ప్రభాస్, పృథ్వీరాజ్ కలయికలో వచ్చిన సన్నివేశాలు మెప్పించాయి. అయితే ఆ విజువల్స్ బాగున్నప్పటికీ, పృథ్వీరాజ్ స్థానంలో గోపీచంద్ ఉంటే ఇంకా బాగుండేది అనే అభిప్రాయం అభిమానుల నుంచి వినిపిస్తోంది. ప్రభాస్, గోపీచంద్‌లు నిజ జీవితంలో మంచి స్నేహితులు. కాబట్టి.. తెర మీద ఈ స్నేహానికి సంబంధించిన సన్నివేశాలు అద్భుతంగా పండేవని అభిప్రాయపడుతున్నారు. పైగా విలనిజంని పండించడంలో గోపీచంద్ దిట్ట. స్నేహితులు శత్రువులుగా మారిన తర్వాత.. ప్రభాస్‌ని ఢీ కొట్టే విలన్‌గా గోపీచంద్ ఇరగదీసేవాడు. ఇలా సలార్ రూపంలో ప్రభాస్, గోపీచంద్ కలిసి నటించే మంచి అవకాశం ఉన్నప్పటికీ.. మూవీ టీం ఆ దిశగా ఆలోచించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒకవేళ దేవగా ప్రభాస్, వరదగా గోపీచంద్ నటించి ఉంటే.. తెలుగునాట సలార్‌పై ఇప్పుడున్న అంచనాలకు రెట్టింపు అంచనాలు ఉండేవి అనడంలో సందేహం లేదు.