Prabhas: రెబల్ స్టార్‌కి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ హ్యాండ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. తమిళ హీరో సూర్య ఇచ్చిన స్టేట్‌మెంట్‌తోనే ప్రభాస్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తోంది. నిజానికి ప్రాజెక్ట్ కే సీక్వెల్, సలార్ 2 పనులు ఎన్ని ఉన్నా, ప్లానింగ్స్ ఎలా ఉన్నా లోకేష్ కోసం డేట్లను ఖాలీగా ఉంచడానికి ప్రభాస్ సిద్దపడ్డాడట. కాని లోకేష్ మాత్రం లియో తర్వాత రజినీ మూవీ అన్నాడు. ఆదయ్యాక ప్రభాస్‌తో సినిమా చేస్తాడా అంటే, ఆ ఆలోచనలో లేడని సూర్య స్టేట్‌మెంట్‌తో తేలింది.
మొన్న ఇలానే సందీప్ రెడ్డి సినిమా స్పిరిట్ ఆఫర్‌ని అనిరుధ్‌కి ఇచ్చాడట ప్రభాస్. తను మాత్రం రణ్‌వీర్‌సింగ్, రణ్‌బీర్ కపూర్ అంటూ బాలీవుడ్ హీరోలతో సినిమాలకు కమిటై నో చెప్పాడు. సరే మ్యూజిక్ డైరెక్టర్ సంగతి అటుంచితే దర్శకుడు లోకేష్ కనకరాజ్ మూవీ అయినా ఓకేనా అనుకుంటే, అది కుదిరేలా లేదు. లియో అయిపోయింది. రజినీకాంత్‌తో సినిమా దసరాకు మొదలు కానుంది. అది సమ్మర్‌లో అయిపోయేలా ప్లాన్ చేస్తున్నాడు లోకేష్. ఆప్పటికి ప్రభాస్ ఫ్రీ అవ్వొచ్చు. మారుతి మూవీ, ప్రాజెక్ట్ కే షూటింగ్స్ అయిపోతాయి.
సీక్వెల్స్ షూటింగ్ మొదలైనా, లోకేష్ మూవీకి ఇబ్బందిరాకుండా ప్రభాస్ ప్లాన్ చేసుకోబోతే.. తను మాత్రం సూర్యకి సై అన్నాడట. రజినీకాంత్‌తో సినిమా తర్వాత విక్రమ్‌లోని రోలెక్స్ పాత్ర లీడ్‌గా సినిమా ప్లాన్ చేస్తున్నాడట. ఆల్రెడీ స్టోరీలైన్ చెబితే సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు, ఫ్యాన్స్‌తో ఓ లైవ్ ఇంటరాక్షన్‌లో సూర్య తేల్చేశాడు.