Prabhas: తగ్గేదేలే.. ప్రభాస్-మారుతి సినిమాకు షాకింగ్ బడ్జెట్..!

ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండా సైలెంట్‌గా మారుతి సినిమా షూటింగ్ మొదలు పెట్టాడు ప్రభాస్. మొదట్లో.. అసలు మారుతితో ప్రభాస్ సినిమా చేయడం ఏంటి అనే కామెంట్స్ వినిపించాయి. కానీ, అన్నీ భారీ ప్రాజెక్స్ట్ కాబట్టి.. మధ్యలో మీడియం రేంజ్ బడ్జెట్‌తో ఈ సినిమా చేస్తున్నాడని వినిపించింది.

  • Written By:
  • Publish Date - November 15, 2023 / 01:37 PM IST

Prabhas: బాహుబలి తర్వాత భారీ బడ్జెట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లు ఉన్నా క్రేజీ ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెడుతున్నాడు. ప్రజెంట్ సెట్స్‌పై ఉన్న సినిమాల్లో సలార్ బడ్జెట్ రూ.250 నుంచి రూ.400 కోట్లతో, కల్కి దాదాపు రూ.500 కోట్ల పైగా బడ్జెట్‌తో పాన్ వరల్డ్ రేంజ్‌లో తెరకెక్కుతున్నాయి. అయితే.. ఈ భారీ ప్రాజెక్ట్స్ మధ్యలో మారుతితో ఓ సినిమా కమిట్ అయ్యాడు డార్లింగ్. ఈ మూవీ గురించి ఓ షాకింగ్ విషయం బయటకు రావడం వైరల్‌గా మారింది.

Prabhas: ఇంద్ర భవనంలాంటి ఇల్లు.. ప్రభాస్‌ కొత్త ఇంటి నిర్మాణం ఖరీదు అన్ని కోట్లా..!

ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండా సైలెంట్‌గా మారుతి సినిమా షూటింగ్ మొదలు పెట్టాడు ప్రభాస్. మొదట్లో.. అసలు మారుతితో ప్రభాస్ సినిమా చేయడం ఏంటి అనే కామెంట్స్ వినిపించాయి. కానీ, అన్నీ భారీ ప్రాజెక్స్ట్ కాబట్టి.. మధ్యలో మీడియం రేంజ్ బడ్జెట్‌తో ఈ సినిమా చేస్తున్నాడని వినిపించింది. అలాగే.. కేవలం తెలుగు ఆడియెన్స్ కోసం ఈ సినిమా చేస్తున్నాడని అన్నారు. అంతేకాక ఈ సినిమాకు ప్రభాస్ పారితోషికమే ఈ సినిమాకు హెయెస్ట్ బడ్జెట్ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమాకు కూడా భారీ బడ్జెట్ పెడుతున్నారనే షాకింగ్ న్యూస్ వైరల్‌గా మారింది. తాజాగా మారుతి, ప్రభాస్ సినిమా బడ్జెట్ గురించి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేవలం వీఎఫ్ఎక్స్ వర్క్ కోసమే దాదాపు రూ.150 కోట్లు వరకు ఖర్చు పెడుతున్నట్టుగా తెలుస్తోంది.

మొత్తంగా.. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 300 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇందులో నిజమెంతో తెలియదు గానీ.. మారుతి ప్రాజెక్ట్ కూడా ప్రభాస్ రేంజ్‌లోనే పాన్ ఇండియా లెవల్లో వస్తుందనే తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నాడు. ఇప్పటికే చాలావరకు షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా నుంచి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ బయటికి రాలేదు. కానీ మారుతి మాత్రం ప్రభాస్‌ క్యారెక్టర్‌ను అదిరిపోయేలా రాసుకున్నట్టు టాక్ ఉంది.