ప్రభాస్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ తట్టుకుంటారా..? ఒక్కో గెటప్ కి 300 కోట్లు..

రెబల్ స్టార్ ప్రభాస్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇద్దరూ 1000 కోట్లని మూడు భాగాలుగా పంచుకునేపనిలో ఉన్నారు. కల్కీ, దేవర మూవీలొచ్చాయి... వసూళ్లతో వండర్స్ క్రియేట్ చేశాయి... మళ్లీ ఏప్రిల్ వరకు రెబల్ స్టార్ ప్రభాస్ మూవీలేవీ లేవు... ఆగస్ట్ వరకు వార్ 2 రాదు కాబట్టి ఈలోపు ఎన్టీఆర్ సినిమాల దండయాత్ర ఉండదు..

  • Written By:
  • Publish Date - December 17, 2024 / 12:54 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇద్దరూ 1000 కోట్లని మూడు భాగాలుగా పంచుకునేపనిలో ఉన్నారు. కల్కీ, దేవర మూవీలొచ్చాయి… వసూళ్లతో వండర్స్ క్రియేట్ చేశాయి… మళ్లీ ఏప్రిల్ వరకు రెబల్ స్టార్ ప్రభాస్ మూవీలేవీ లేవు… ఆగస్ట్ వరకు వార్ 2 రాదు కాబట్టి ఈలోపు ఎన్టీఆర్ సినిమాల దండయాత్ర ఉండదు.. అలాంటప్పుడు ఈ ఇద్దరూ వెయ్యికోట్లు పంచుకోవటం ఏంటి? ఈ డౌట్ వెనకే ప్రభాస్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో పూనకాలు మొదలయ్యే మ్యాజిక్ ఉంది. రెబల్ స్టార్ ది రాజా సాబ్ ఏప్రిల్ లోరాబోతోంది. తర్వాత స్పిరిట్ 2026 సమ్మర్ కి వచ్చేలా సందీప్ రెడ్డి ప్లాన్ చేస్తున్నాడు. ఈ రెండు మూవీల్లో ప్రభాస్ ఇక మీదట ఒకడుగా కాదు ఐదుగురిగా మారబోతున్నాడు.మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కూడా దేవరలానే ఇద్దరు కాదు ముగ్గురమంటున్నాడు. ఇంతకి ఈ వన్ ప్లస్ త్రీ ఆఫర్ వెనకున్న లాజిక్ ఏంటి? వెయ్యికోట్లని మూడు భాగాలుగా మార్చటం వెనకున్న రీజనేంటి? చూసేయండి..

రెబల్ స్టార్ సినిమా అంటే వెయ్యికోట్ల వసూళ్లు కామన్ అనేంతగా ఓ ఇంప్రెషన్ మార్కెట్ లో క్రియేట్ అయ్యింది. బాహుబలి2, కల్కీ వెయ్యికోట్లు దాటడం మాత్రమే కాదు సలార్ కూడా ఆల్ మోస్ట్ 1000 కోట్లకు దరిదాపుల్లోకి వెళ్లింది. ఇప్పుడు ది రాజా సాబ్ వంతొచ్చింది. ఏప్రిల్ 10కి వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న ఈ పాన్ ఇండియా హర్రర్ కామెడీ డ్రామాలో ప్రభాస్ మూడు గెటప్పులు కాదు మూడు పాత్రల్లో కనిపించబోతున్నాడట

ది రాజా సాబ్ లో ప్రభాస్ తాత, తండ్రి, మనవడు ఇలా మూడు తరాల్లో మూడు పాత్రలు వేయబోతున్నాడు. మలయాళ మూవీ ఏ ఆర్ ఎమ్ లో హీరో మూడు జెనరేషన్ల కు సంబంధించిన వ్యక్తిగా ఒక్కడే కనిపించాడు. అచ్చంగా అలానే ప్రభాస్ మూడు పాత్రలు వేశాడన్న ప్రచారం, ఇప్పడు నిజం అనితేలింది

ఐతే బాహుబలిలో తండ్రిగా, తాతగా, కొడుగ్గా కనిపించిన ప్రభాస్ కి ఒకే సినిమాలో మూడు పాత్రలు కొత్తకాదు. కాని అందులో ఒక పాత్ర గోడమీద ఫోటోకే పరిమితమైంది. అమరేంద్ర బాహుబలి, మహేంద్రబాహుబలి పాత్రల్లోనే కనిపించి బాక్షాఫీస్ ని షేక్ చేశాడు ప్రభాస్. ఇప్పడు మూడు పాత్రలతో ది రాజా సాబ్ ని 1000 కోట్ల కటౌట్ గా మార్చబోతున్నాడు. గెటప్ కి 330 కోట్ల చొప్పున మూడు గెటప్పులకు 1000 కోట్లొచ్చినట్టే అంటూ లెక్కలేస్తున్నారు. ఇక బయట ప్రచారం జరిగినట్టు ఈ సినిమాలో గ్రాఫిక్స్ 50శాతం కానే కాదని తెలుస్తోంది. 75 శాతం విజువల్ ఎఫెక్ట్స్ తో రాబోతున్న తొలి భారతీయ మూవీ ఇదే అనితెలుస్తోంది. ఇది కూడా ఫ్యాన్స్ లో గూస్ బంప్స్ తీసుకొచ్చే మ్యాటరే.

అసలే ఒక్క ప్రభాస్ ని చూస్తేనే బాక్సాఫీస్ లో వసూళ్లకి పూనకాలొస్తాయి, మరి ఒకే తెరమీద ముగ్గురు రెబల్ స్టార్స్ ని చూస్తే ఫ్యాన్స్ తట్టుకుంటారా? ఇదే ప్రశ్న మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ విషయంలో కూడా ఎదురౌతోంది. ఎందుకంటే, ఎన్టీఆర్ కూడా ఇలానే ఒకే సినిమాలో మూడు పాత్రలు వేస్తున్నాడు. జై లవకుశలో ఆల్రెడీ మూడు పాత్రలేసిన తారక్ అప్పుడు పాన్ ఇండియా స్టార్ గా వెలగలేదు. త్రిబుల్ ఆర్, దేవర తర్వాతే తన ఇమేజ్, మార్కెట్ లో మైలేజ్ ఇండియా నుంచి ఆసియా ఎండ్జ్ వరకు ఎక్కడికో వెళ్లిపోయింది.

అలాంటి తనిప్పుడు మూడు పాత్రల్లో ఒకే మూవీ చేస్తున్నాడంటే, అది నిజంగా పాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చేసే అంశమే. ఆంద్రావాలా, అదుర్స్ నుంచి జైలవకుశ వరకు తనకి డబుల్ ఫోటో, త్రిబుల్ ఫోటో కాన్సెప్ట్ ప్రతీ సారి కలిసొచ్చింది. అందుకే ప్రశాంత్ నీల్ మేకింగ్ లో డ్రాగన్ గా మూడు పాత్రల్లో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడని ఆల్ మోస్ట్ తేలింది. సంక్రాంతికి టైటిల్ తోపాటు పోస్టర్ లాంచ్ చేసేందుకు ఫిల్మ్ టీం రెడీ చేస్తున్న పోస్టర్ వల్లే ఈ మ్యాటర్ లీకైనట్టు తెలుస్తోంది. మొత్తంగా ఈ ఇద్దరు మొనగాల్లు, ఒకేసారి ముగ్గురు మొనగాళ్లుగా మారబోతున్నారనగానే ఇక ఫ్యాన్స్ తట్టుకుంటారా అన్న ప్రశ్న మొదలైంది.