PRABHAS: స్పిరిట్ మూవీకోసం ముహూర్తం ఖరారు చేసిన సందీప్..

సందీప్ రెడ్డి వంగ.. వచ్చే ఏడాది దసరాకు రెబల్ స్టార్ ప్రభాస్‌తో కమిటైన సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాడు. ఐతే మార్చ్‌లో ఈ సినిమా తాలూకు ఆఫీస్‌ని లాంచ్ చేసి ప్రీ ప్రొడక్షన్ వర్క్ షురూ చేయబోతున్నారట.

  • Written By:
  • Publish Date - December 19, 2023 / 07:46 PM IST

PRABHAS: రెబల్ స్టార్ ప్రభాస్‌తో సందీప్ రెడ్డి వంగ మూవీ ఫిక్స్ అయ్యింది. సినిమా పేరు స్పిరిట్ అని ఎప్పుడో ఎనౌన్స్ చేశారు. ఇక బన్నీతో కూడా సందీప్ రెడ్డి వంగ సినిమా ఎనౌన్స్ చేశారు. టైటిల్ మాత్రం ఎనౌన్స్ చేయలేదు. ఐతే ఈ రెండు సినిమాల ఫేట్‌ని, షూటింట్ డేట్‌ని సందీప్ రెడ్డి వంగా ఫిక్స్ చేశాడు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ యానిమల్ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు. వచ్చే ఏడాది దసరాకు రెబల్ స్టార్ ప్రభాస్‌తో కమిటైన సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాడు.

SALAAR: సలార్ టిక్కెట్ ధరల పెంపు.. ఎంత పెంచారంటే..

ఐతే మార్చ్‌లో ఈ సినిమా తాలూకు ఆఫీస్‌ని లాంచ్ చేసి ప్రీ ప్రొడక్షన్ వర్క్ షురూ చేయబోతున్నారట. అక్టోబర్‌లో సినిమా షూటింగ్ మొదలౌతుందట. ఆ తర్వాత 2025 సమ్మర్ ఎండింగ్‌లో యానిమల్ సీక్వెల్.. యానిమల్ పార్క్ మొదలౌతుందని తెలుస్తోంది. ఆల్రెడీ స్క్రిప్ట్ రెడీగా ఉండటం వల్ల సీక్వెల్‌కి పెద్దగా ఆలస్యం కాదని తెలుస్తోంది. దాన్ని పూర్తి చేశాకే స్పిరిట్ చేయాలనుకున్నా, ముందుగా ప్రభాస్‌కి ఇచ్చిన కమిట్‌మెంట్ వల్ల ముందు రెబల్ స్టార్ మూవీనే పూర్తి చేస్తాడట సందీప్ రెడ్డి. అంతేకాదు యానిమల్ పార్క్ తర్వాతే బన్నీ సినిమా సెట్స్ పైకెళుతుందట.

ఈలోపు త్రివిక్రమ్, బోయపాటి, ప్రశాంత్ నీల్ మూవీలు చేసేందుకు ఐకాన్ స్టార్ ప్రిపేర్ అయ్యాడని తెలుస్తోంది. మొత్తానికి టీ సీరీస్‌తో కబీర్ సింగ్, యానిమల్ మూవీలు కలిసి చేసిన సందీప్.. ఇప్పుడు ప్రభాస్, బన్నీ, యానిమల్ సీక్వెల్‌ని కూడా ఆ బ్యానర్‌లోనే కమిటవుతున్నాడు.