Prabahs : 16 ఏళ్ళ తర్వాత ఆ హీరోయిన్ తో ప్రభాస్

  • Written By:
  • Updated On - August 6, 2024 / 03:06 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో నటించాలని ఇప్పుడు హీరోయిన్లు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఆయనతో ఒక్క సినిమా చేసినా చాలు లైఫ్ సెట్ అయిపోతుందని యంగ్ హీరోయిన్లు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ప్రభాస్ తో కొందరు హీరోయిన్లకు మాత్రం పదే పదే అవకాశాలు వస్తూనే ఉంటాయి. అందులో ముఖ్యంగా అనుష్క ముందు వరసలో ఉంటారు. ఆమె ప్రభాస్ దాదాపు నాలుగు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత త్రిష మూడు సినిమాల్లో ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది.

ఈ కాంబినేషన్ల కోసం ఫ్యాన్స్ మళ్ళీ ఎదురు చ్చూస్తున్నారు. ఒక్క సినిమా వీళ్ళ కాంబినేషన్ లో మళ్ళీ వచ్చినా చాలు అనుకుంటున్నారు. ఇప్పుడు అది నిజమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. వరుస పెట్టి సినిమాలు చేస్తున్న ప్రభాస్ ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తైన సంగతి తెలిసిందే. త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. దీనితో హీరోయిన్ ఎవరు అనే దానిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి.

హీరోయిన్ గా త్రిష ని ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నాడట దర్శకుడు. దీనికి సంబంధించి ఇప్పటికే త్రిష తో చర్చలు జరిపాడని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. వీళ్ళు ఇద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి. వర్షం సినిమా సూపర్ హిట్ కాగా ఆ తర్వాత వచ్చిన పౌర్ణమి ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇద్దరి కెమిస్ట్రీ బాగా నచ్చేసింది. ఇక బుజ్జిగాడు సినిమా విషయానికి వస్తే టీవీ లో ఇప్పుడు వచ్చినా సరే ప్రభాస్ ఫ్యాన్స్ చూస్తారు. ఈ సినిమాలో కూడా వీరి కెమిస్ట్రీ బాగుంటుంది. దీనితో ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరూ స్క్రీన్ మీద కనపడితే చాలు అనుకుంటున్నారు ఫాన్స్. అదే నిజం అయితే దాదాపు 16 ఏళ్ళ తర్వాత వీరి కాంబినేషన్ రిపీట్ అవుతుంది.