PRABHAS: రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల విషయంలో, పాన్ ఇండియా మార్కెట్ విషయంలో, ఇమేజ్ విషయంలో ఇలా చాలా అంశాల్లో పవన్ నుంచి మహేశ్ వరకు, చరణ్ నుంచి తారక్ వరకు అందర్ని మించిపోయాడు. పాన్ ఇండియా మూవీలు తీసినా కాని ఎవరూ ప్రభాస్ ని టచ్ చేయలేని స్థాయికి వెళ్లటమే కాదు, ఆ స్థానాన్ని బానే కాపాడుకుంటున్నాడు. బలంగా ఫైట్ చేస్తున్నాడు. పాన్ ఇండియా ఇమేజ్ వస్తే అందులో ఇరుక్కున్నట్టే అన్నారు. అది కొంతవరకు నిజమే.
MLC KAVITHA: ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఐటీ సోదాలు..
బాహుబలి తో అమాంతం పెరిగిన ప్రభాస్ ఇమేజ్ ని మోయాలంటే, ఆరేంజ్ కథలు కావాలి. ఆ విషయంలో సాహో, రాధేశ్యామ్, ఆది పురుస్ తో పంచులు పడ్డాయి.. కాని సలార్ హిట్ తో రాజమౌళి సాయం లేకుండానే పాన్ ఇండియాని షేక్ చేసే రేంజ్ ఉందని ప్రభాస్ ప్రూవ్ చేసుకోగలిగాడు. విచిత్రం ఏంటంటే ఈ విషయంలోనే ఇంకా చరణ్, తారక్, బన్నీ ప్రూవ్ చేసుకోలేకపోతున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరికీ త్రిబుల్ ఆర్ తో గ్లోబర్ స్టార్ గా గుర్తింపువచ్చింది. కాని ఆ తర్వాత వేగంగా మూవీలు చేయటంలో సక్సస్ కాలేకపోతున్నారు. శంకర్ మూవీ మొదలై రెండేళ్లౌతోంది. త్రిబుల్ ఆర్ తర్వాత సినిమాకోసం ఆల్రెడీ తారక్ రెండేళ్లు ఖర్చుచేశాడు. బన్నీ పుష్ప సీక్వెల్ కోసమే రెండున్నరేళ్లు కరిగించేశాడు. ఇంకా వీళ్లు పాన్ ఇండియా రేంజ్ లోవరుసగా సినిమాలు చేయటంలో సక్సెస్ కాలేకపోతున్నారు. ప్రభాస్ మాత్రం ఈపాటికే సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్ చేశాడు.
అందులో సాహో యావరేజ్ గా ఆడినా, సలార్ హిట్టైంది. కల్కీ రాబోతోంది. ది రాజా సాబ్ సంక్రాంతికని ఫిక్స్ అయ్యింది. వీటితో పాటు హానురాఘవపూడీ సినిమా సందీప్ రెడ్డి మూవీ స్పిరిట్ తోపాటు సలార్ 2 ని కూడా పట్టాలెక్కిస్తున్నాడు. బేసిగ్గా దీపిం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలంటారు, ప్రభాస్ చక్క బెట్టుకోవటం కాదు మల్టీ ప్లెక్లులే కట్టేస్తున్నాడు. ఇమేజ్ ఉన్నప్పుడే పాన్ ఇండియా మార్కెట్ లో జెండాని బలంగా నాటుతున్నాడు.