Prabhas: ఇంద్ర భవనంలాంటి ఇల్లు.. ప్రభాస్‌ కొత్త ఇంటి నిర్మాణం ఖరీదు అన్ని కోట్లా..!

ప్రభాస్‌ హైదరాబాద్‌‌లో ఓ లగ్జరీ ఇల్లు కట్టించుకోబోతున్నారట. ఆ ఇంటి నిర్మాణం కోసం ప్రభాస్‌ ఇప్పటికే స్థలాన్ని కొన్నారట. హైదరాబాద్‌ నగరానికి కొంచెం దూరంగా, నగర శివారులో రెండు ఎకరాల స్థలాన్ని ఇంటి నిర్మాణం కోసం తీసుకున్నారట.

  • Written By:
  • Publish Date - November 15, 2023 / 12:16 PM IST

Prabhas: చిత్ర పరిశ్రమలో రజనీకాంత్‌ తర్వాత అంత క్రేజ్‌ ఉన్న స్టార్‌ ఎవరైనా ఉన్నారంటే.. అది కచ్చితంగా ప్రభాస్‌ అని చెప్పొచ్చు. బాహుబలి సినిమాల తర్వాత ఆయన క్రేజ్‌ దేశ వ్యాప్తంగా ఆకాశానికి అంటింది. బాలీవుడ్‌ తారలు సైతం ప్రభాస్‌ ముందు ఢీలా పడేలా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌తో పాటు మార్కెట్‌ను సొంతం చేసుకున్నాడు. ప్లాపు సినిమాలు కూడా వందల కోట్ల రూపాయల కలెక్షన్లను రాబడుతున్నాయి. సాహో, రాధేశ్యామ్‌, ఆదిపురుష్‌ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడినా కాసులు కురిపించాయి.

Shankar: ఒకే ఫ్రేమ్‌లో అన్నదమ్ములు.. సూర్య, కార్తిలతో శంకర్ మల్టీస్టారర్ మూవీ

ఫస్ట్‌ డే, ఓవర్‌ ఆల్‌ కలెక్షన్ల విషయంలో మాత్రం ఈ మూడు సినిమాలు కొన్ని హిట్టు సినిమాలకు పోటీ వచ్చాయి. దీన్ని బట్టే అర్థం అయిపోతుంది ప్రభాస్‌ క్రేజ్‌ ఏ లెవెల్లో ఉందో. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభాస్‌ అభిమానులతో పాటు సగటు సినీ ప్రేక్షకుడు ‘సలార్‌’ సినిమా కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్న ప్రభాస్‌కు సంబంధించిన ఓ న్యూస్‌ మీడియాతో పాటు సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ప్రభాస్‌ హైదరాబాద్‌‌లో ఓ లగ్జరీ ఇల్లు కట్టించుకోబోతున్నారట. ఆ ఇంటి నిర్మాణం కోసం ప్రభాస్‌ ఇప్పటికే స్థలాన్ని కొన్నారట. హైదరాబాద్‌ నగరానికి కొంచెం దూరంగా, నగర శివారులో రెండు ఎకరాల స్థలాన్ని ఇంటి నిర్మాణం కోసం తీసుకున్నారట. కేవలం ఈ స్థలం విలువే 120 కోట్ల రూపాయలు అన్న టాక్‌ నడుస్తోంది. ఇప్పటికే ఇంటి నిర్మాణ పనులు మొదలయ్యాయట. కేవలం ఇంటి నిర్మాణం కోసం దాదాపు 80 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నారని సమాచారం.

ప్రభాస్‌కు హైదరాబాద్‌ నగరంలో చాలా ఇళ్లు ఉన్నా.. కేవలం ప్రశాంతత కోసం ఊరి బయట ఈ ఇంటిని నిర్మించుకుంటున్నారట. ఈ ఇంటి కోసం ఏకంగా 200 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారట. ఇంట్లో అన్ని సదుపాయాలు ఉండేలా చూసుకుంటున్నారట. అత్యంత లగ్జరీగా ఈ ఇల్లు ఉండబోతోందట. అయితే, ఈ వార్తల్లో నిజం ఎంతుందో తెలీదు. ఒక వేళ ఇదే గనుక నిజం అయితే.. అత్యంత ఖరీదైన, విలాసవంతమైన ఇల్లు ఉన్న ఇండియన్‌ స్టార్‌ హీరోల్లో ప్రభాస్‌ కూడా ఒకరవుతారు. కాగా, ప్రభాస్‌కు ఇటలీలో కూడా ఓ విలాసవంతమైన ఇల్లు ఉన్నట్లు సమాచారం. ఆ ఇంటిని వెకేషన్‌ కోసం వాడుతూ ఉంటారని, మిగతా సమయంలో అద్దెకు ఇస్తూ ఉంటారన్న ప్రచారం కూడా జరుగుతోంది.