SALAAR: గూస్‌బంప్స్ లోడింగ్.. సలార్‌ 2 పై ప్రభాస్ లీక్‌.. పూనకాల్లో ఫ్యాన్స్

మూడు రోజుల్లో సలార్‌ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.402 కోట్ల గ్రాస్ వ‌సుళ‌ను కొల్లగొట్టింది. ఈ చిత్రం లాంగ్ రన్‌లో రూ.1000 కోట్ల క్లబ్‌లో చేర‌టం పక్కా అని ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.

  • Written By:
  • Publish Date - December 25, 2023 / 08:06 PM IST

SALAAR: పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరో ప్రభాస్ పేరు ఎక్కడ చూసినా మార్మోగిపోతోంది. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద మాస్ జాతర చేస్తున్నాడు రెబ‌ల్ స్టార్‌. ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో భారీ వసూళ్ళ వర్షం కురుస్తుంది. ఇక మూడు రోజుల్లో సలార్‌ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.402 కోట్ల గ్రాస్ వ‌సుళ‌ను కొల్లగొట్టింది. ఈ చిత్రం లాంగ్ రన్‌లో రూ.1000 కోట్ల క్లబ్‌లో చేర‌టం పక్కా అని ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.

PALLAVI PRASHANTH: పల్లవి ప్రశాంత్‌ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌.. వాళ్లు ఎవరంటే..

ఇదిలా ఉంటే సలార్ 2 గురించి ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది. సలార్ కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డు క్రియేట్ చేస్తున్న వేళ మేకర్స్ అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది. గూస్ బంప్స్ తెప్పించేలా మేకింగ్ వీడియోను సర్ప్రైజ్‌గా రిలీజ్ చేసింది. ఈ వీడియోని చూస్తుంటే ప్రభాస్ అభిమానులకే కాదు.. యాంటీ రెబల్ ఫాన్స్‌కి సైతం గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. ఫైట్ సీన్స్ ఎలా తీశారు అనేది ఆసక్తికరంగా చూపించారు. ప్రశాంత్ నీల్ మేకింగ్ స్టైల్.. ఫైట్ మాస్టర్ చేసిన పోరాటాలు.. మ్యూజిక్ డైరెక్టర్ రవి.. తెర వెనక చేసిన మ్యాజిక్.. నటీనటుల పెర్ఫార్మెన్స్.. ఒక్క వీడియోతో చూపించేశారు. ప్రస్తుతం ఈ మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో దూసుకెళ్తుంది.

సలార్ పార్ట్ 1తో రేర్ రికార్డ్ క్రియేట్ చేసిన ప్రభాస్.. పార్ట్ 2 గురించి ఇచ్చిన లీక్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. సలార్ మూవీ ఇండియాలోనే కాదు.. వరల్డ్ వైడ్‌గా రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఓ ఇంగ్లీష్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకోవడం వైరల్‌గా మారింది. సలార్ మొదటి భాగం కంటే రెండో పార్ట్ ఇంకా అద్భుతంగా ఉంటుందని రెబల్ స్టార్ హింట్ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఇప్పటి నుంచి పూనకాలతో ఊగిపోతున్నారు. ప్రశాంత్ నీల్ వంటి దర్శకుడితో కలసి పనిచేయడం తన అదృష్టమని.. స్క్రిప్ట్ చాలా డిఫరెంట్‌గా ఉందనీ, ప్రశాంత్ నీల్ కథ చెప్పిన విధానం కూడా అద్భుతంగా ఉందని చెప్పుకొచ్చాడు.

SALAAR: బాలీవుడ్ బలుపు తగ్గించిన సలార్.. లాస్ట్ పంచ్ మనదే..

బాహుబలి సక్సెస్ తర్వాత, తాను ఒప్పుకున్న ప్రతి సినిమానూ ఎంతో కష్టపడి పనిచేశానని చెప్పారు. విభిన్నమైన, ఛాలెంజింగ్‌గా ఉండే ఇతి వృత్తాలను ఎంపిక చేసుకున్నానని ప్రభాస్ తెలిపాడు. రాజమౌళి, ప్రశాంత్ నీల్ వంటి దర్శకులతో పనిచేయడం ఎంతో బాగుందన్నారు. మొత్తానికి సలార్ పార్ట్ 1 సంచనాలకు కేరాఫ్‌గా మారితే.. పార్ట్ 2 అంతకు మించి ఉంటుందని డార్లింగ్ చెప్పడంతో మూవీ కోసం ఇప్పటి నుంచే ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.