హాలీవుడ్ లెవెల్లో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు నాగ్అశ్విన్. భారీ బడ్జెట్‌తో బాక్సాఫీస్‌ను కొల్లగొట్టమే లక్ష్యంగా వస్తున్నాడు. ప్రభాస్ పక్కన దీపికా పదుకుణె హీరోయిన్గా నటిస్తోంది. బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ ఈ సినిమాలో కీరోల్ ప్లే చేస్తున్నారు. సినిమాలో కాస్టింగ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా.. ప్రభాస్‌కు ప్రతినాయకుడు ఎవరు అనే విషయాన్ని మాత్రం మూవీ యూనిట్ ఇప్పటి వరకూ ఎనౌన్స్ చేయలేదు.
ఈ సినిమాలో విలన్‌గా కనిపించేది ఎవరు అనే విషయం ఇప్పటికీ సస్పెన్సే. అయితే ఇదే విషయంలో ఇప్పుడు ఓ అదిరిపోయే గాసిప్ సినీ వర్గాలను చుట్టేస్తోంది. ప్రాజెక్ట్-Kలో ప్రభాస్‌కు విలన్‌గా లోకనాయకుడు కమల్ హాసన్‌ను తీసుకోబోతున్నట్టు సమాచారం. దీనికోసం ఆయనకు భారీ రెమ్యునరేషన్ కూడా ఇచ్చేందుకు మూవీ మేకర్స్ సిద్ధమయ్యారట. సినిమాలో ప్రభాస్‌ను ఎంత పవర్‌ఫుల్‌గా చూపించబోతున్నారో.. కమల్‌హాసన్ క్యారెక్టర్‌ను కూడా అంతే పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశారట.
ఇప్పుడంటే కుర్ర హీరోలు ఊపేస్తున్నారు గానీ.. అప్పట్లోనే ఇండియా వైడ్‌గా క్రేజ్ తెచ్చుకున్నాడు కమల్ హాసన్. ఇప్పుడు ప్రభాస్ కూడా అదే రేంజ్ మెయిన్టేన్ చేస్తున్నాడు. ఇక ఈ ఇద్దరు హీరోలు ఒకే స్క్రీన్ మీద కనిపిస్తే.. అది కూడా ఇద్దరి మధ్య ఫైట్ జరిగితే బొమ్మ దద్దరిల్లిపోవడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్. అయితే ఈ విషయంలో ప్రస్తుతం ప్రాజెక్ట్ కే మేకర్స్ టీం కమల్‌తో చర్చలు జరుపుతోందట. ఈ డీల్‌కు కమల్ ఓకే అంటే ఈ విషయంలో అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇచ్చే చాన్స్ ఉంది. ప్రస్తుతానికి ఇది గాసిప్‌గానే ఉన్నా.. త్వరలోనే ఇది నిజం కావాలని కమల్, ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.