సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ గా ఉంటారనే టాక్ మనం వింటూనే ఉంటాం. సినిమా నిర్మాతలను, డిస్ట్రిబ్యూటర్లను అసలు పట్టించుకోరు హీరోలు, దర్శకులు అనే కామెంట్స్ వస్తూ ఉంటాయి. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా సరే తమకు రావాల్సింది కమర్షియల్ గానే ఆలోచించి వసూలు చేస్తూ ఉంటారు అని వింటూనే ఉంటాం. కాని కొందరు డైరెక్టర్ లు మాత్రం ఈ మధ్య కాస్త మానవత్వం చూపిస్తున్నారు. లేటెస్ట్ గా తన సినిమా ఫ్లాప్ కావడంతో సినిమా కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్ల కోసం కీలక నిర్ణయం తీసుకున్నాడు యంగ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్.
దిలీప్ కుమార్ డైరెక్షన్ లో కవిన్ హీరోగా రిలీజ్ అయిన ‘బ్లడీ బెగ్గర్’ దారుణంగా ఫ్లాప్ అయింది. దిలీప్ పై నమ్మకంతో సినిమా కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోయారు. దీనితో వాళ్ళ కోసం ఆ చిత్ర నిర్మాతగా ఉన్న… నెల్సన్ దిలీప్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు తిరిగి ఇవ్వడానికి ముందుకు వచ్చి అందరికి షాక్ ఇచ్చాడు. ‘బ్లడీ బెగ్గర్’ మూవీ తమిళనాడులో ఫైవ్‌స్టార్ సెంథిల్ కొన్నారు. రూ.10 కోట్ల ఖర్చు పెట్టి కొంటే… కేవలం రూ.4 కోట్లు మాత్రమే వసూలు అయ్యాయి.
అన్ని ఖర్చులు కలిపి డిస్ట్రిబ్యూటర్ కు రూ.7 కోట్ల మేరకు నష్టాలు వచ్చాయి. దీనితో దిలీప్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నిర్మాత – డిస్ట్రిబ్యూటర్ మధ్య డీల్ లో నష్టం వాటిల్లినా నిర్మాత డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. అయినా సరే నెల్సన్ దిలీప్ కుమార్ మాత్రం… ఫైవ్‌స్టార్ సెంథిల్‌తో సహా ఇతర డిస్ట్రిబ్యూటర్లను ఆదుకోవడానికి రూ.5 కోట్లు తిరిగి ఇవ్వడానికి రెడీ అయ్యారు. దీనిపై తమిళ సినిమాతో పాటుగా అన్ని భాషల్లో ప్రశంశలు వ్యక్తమవుతున్నాయి. ఈ రోజుల్లో ఆ నిర్ణయం తీసుకోవడం సంచలనమే.
ఇక ఈ సినిమా నిర్మించడం పట్ల ఆయనకు ఇబ్బంది ఏం లేదు. శాటిలైట్ రైట్స్ విక్రయించడం ద్వారానే భారీగానే లాభాలు వచ్చాయి అని టాక్. జైలర్ సినిమాతో స్టార్ డైరెక్టర్ ఇమేజ్ తెచ్చుకున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. రజనీ కాంత్ తో కూలి సినిమా తర్వాత జైలర్ సీక్వెల్ కూడా ప్లాన్ చేసాడు. ఇదే టైం లో ప్రభాస్ కు కూడా ఒక కథ చెప్పించి ఒప్పించాడు. హోంబలే బ్యానర్ లో ఈ సినిమా చేయనున్నారు. ఈ సినిమా 2028 లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఏది ఏమైనా దిలీప్ కుమార్ నిర్ణయం మాత్రం సూపర్.