PRABHAS: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. బాహుబలి తర్వాత నుంచి పాన్ ఇండియా లెవెల్లో అదిరిపోయే క్రేజ్ తెచ్చుకున్నాడు. మధ్యలో అపజయాలు పలకరించినా.. రెబల్ స్టార్ క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. ఇక ఇటీవల సలార్ మూవీ తన కటౌట్‌కు తగ్గ భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు ప్రభాస్. సలార్ మూవీ బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించింది. ఇక.. ఈ మూవీ తర్వాత ప్రభాస్ గ్రాఫ్ స్కై హైగా దూసుకుపోయింది.
Rakul Preet Singh: రకుల్ దంపతులకు మోదీ లెటర్.. ఏం రాశారో తెలిస్తే అవాక్కవుతారు..
దీంతో.. ఈ డైనోసార్ నెక్స్ట్ సినిమాలపై మరిన్ని అంచనాలు సెట్ అయ్యాయి. ఈ క్రమంలో ప్రభాస్ సినిమాల లైనప్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. సలార్ మూవీతో తన అసలైన స్టామినా ఏమిటో రుచి చూపించిన ప్రభాస్.. ఇప్పుడు ఇండియన్ మార్కెట్‌పై ఫుల్ ఫోకస్ పెట్టాడు. ఇండియన్ మూవీ హిస్టరీలో ఏ హీరోకు సాధ్యం కాని విధంగా.. ఒక్క ప్రభాస్ పేరు మీదనే రానున్న రెండు మూడేళ్లలో దాదాపు మూడు వేల కోట్ల మార్కెట్ నడవనుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. దీనితో ఇక నెక్స్ట్ సినిమాలపై మరిన్ని అంచనాలు సెట్ అయ్యాయి. ఇండియన్ సినిమా లోనే మోస్ట్ అవైటెడ్ లైనప్‌ను ప్రభాస్ సెట్ చేశాడు. తన క్రేజ్‌కు తగ్గట్లుగా వరల్డ్ మార్కెట్‌పై ఫోకస్ పెట్టిన ప్రభాస్ మొత్తం మొత్తం 10 సినిమాల వరకు లైనప్‌ను సెట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఆల్రెడీ కన్ఫర్మ్ అయ్యి ఉన్న చిత్రాలు కల్కి 2898ఎడి, ది రాజా సాబ్, అలాగే సలార్ శౌర్యాంగ పర్వం, స్పిరిట్ అలాగే దర్శకుడు హను రాఘవపూడితో సినిమా కూడా ఒకటి ఉంది.
అలాగే.. దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో పాటు.. దర్శకుడు రాజమౌళితో కూడా ఓ పాన్ వరల్డ్ మూవీ ఉంటుంది అని స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. వీటితో పాటు.. సలార్ సిరీస్ కాకుండా మళ్ళీ ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమా, కల్కికి కూడా సీక్వెల్ ఉందనీ టాక్ ఇండియన్ మూవీ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. దీనికి యాడింగ్‌గా ఇప్పుడు మరో న్యూస్ ఫ్యాన్స్‌ను ఊపేస్తోంది. మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కూడా ప్రభాస్ లైనప్ లోకి వచ్చాడని ఫ్రెష్ రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. మొత్తానికి ఒకేసారి ప్రభాస్ నుంచి 10 సినిమాలు వరకు సెన్సేషనల్ లైనప్‌ని సెట్ చేసుకున్నాడట. మరి వీటిలో ఎన్ని సినిమాలు సెన్సేషన్ సృష్టిస్తాయో.. ప్రభాస్ రేంజ్‌ను ఏ లెవల్‌కు తీసుకెళ్తాయో చూడాల్సిందే.