SALAAR: ప్రభాస్‌ డ్యుయల్‌ రోల్‌ కన్ఫార్మ్‌.. ఇంకెన్ని సర్‌ప్రైజ్‌లు ప్లాన్‌ చేశావ్ నీల్‌ మావా..

ఈ మూవీలో ప్రభాస్‌.. దేవా అనే కేరక్టర్ ప్లే చేస్తున్నాడు. తన బెస్ట్ ఫ్రెండ్ కోసం దేవా ఏం చేయబోతున్నాడు అనేది ఈ సినిమా స్టోరీ లైన్‌. ఐతే సినిమా టైటిల్‌ మాత్రం సలార్‌. అంటే ఈ దేవానే సలారా.. లేదంటే సలార్‌ పాత్ర వేరే ఉందా..?

  • Written By:
  • Publish Date - December 19, 2023 / 05:38 PM IST

SALAAR: సలార్ రెండో ట్రైలర్‌ క్రియేట్ చేసిన బజ్ అంతా ఇంతా కాదు. కంటెంట్‌ ఉంటే కటౌట్‌ చాలు.. ప్రి రిలీజ్‌లు, ఇంటర్వ్యూలు అవసరం లేదని సలార్‌ ప్రూవ్‌ చేసింది. ట్రైలర్‌లో ప్రభాస్ డైలాగులకు ఫ్యాన్స్‌కు పూనకాలు ఒక్కటే తక్కువ. స్టోరీ ఏంటో ట్రైలర్‌లో డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌ క్లియర్‌గా చెప్పేశాడు. అదే సమయంలో కొన్ని లీక్‌లు ఇచ్చి సస్పెన్స్‌ క్రియేట్‌ చేశాడు. 22న రిలీజ్‌ కాబోతున్న సలార్‌ మూవీ మీద భారీ అంచనాలు ఉన్నాయ్.

RAVI TEJA: మార్కెట్‌ను మించి రెమ్యునరేషన్ అడుగుతున్న రవితేజ.. షాక్‌లో నిర్మాతలు

ఈ మూవీలో ప్రభాస్‌.. దేవా అనే కేరక్టర్ ప్లే చేస్తున్నాడు. తన బెస్ట్ ఫ్రెండ్ కోసం దేవా ఏం చేయబోతున్నాడు అనేది ఈ సినిమా స్టోరీ లైన్‌. ఐతే సినిమా టైటిల్‌ మాత్రం సలార్‌. అంటే ఈ దేవానే సలారా.. లేదంటే సలార్‌ పాత్ర వేరే ఉందా.. నిజంగా వేరే ఉంటే ప్రభాస్‌ డ్యుయల్‌ రోల్ ప్లే చేస్తున్నాడా అని అభిమానుల్లో డిస్కషన్ జరుగుతోంది. ఐతే ఈ సస్పెన్స్‌కు ట్రైలర్‌తోనే నీల్ సమాధానం చెప్పినట్లు కనిపిస్తున్నాడు. దేవాతో పాటు సలార్‌ అనే పాత్రలోనూ ప్రభాస్ యాక్ట్ చేస్తున్నాడని.. డార్లింగ్‌ది డ్యుయల్‌ రోల్ అని కన్ఫార్మ్ చేశాడని ఫ్యాన్స్ లెక్కలేసుకుంటున్నారు. రెండు వేర్వేరు ఫ్రేమ్‌లలో ప్రభాస్‌ లుక్‌ చూసి.. ఫ్యాన్స్ ఈ డెసిషన్‌కు వచ్చారు. ఒక ప్రభాస్ చేతికి టాటూ ఉంటే.. ఇంకో ప్రభాస్‌ చేతికి టాటూ ఉండదు. అంటే రెండు వేర్వేలు పాత్రలు అని ఫ్యాన్స్‌ డిసైడ్ అయిపోయారు. దీనికితోడు ప్రభాస్‌ డైలాగ్‌ డిక్షన్‌.. రెండు విధాలుగా వినిపిస్తుంది. గెటప్‌ కూడా వేర్వేరుగా ఉంది. ఇలా లెక్కలన్నీ వేసుకొని.. ప్రభాస్‌ది డ్యుయల్‌ రోల్ అని ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్.

ఈ చర్చకు తోడు.. సలార్‌కు, కేజీఎఫ్‌కు లింక్ ఉంటుందా అనే ప్రశ్న కూడా మూవీకి ఎక్కడలేని హైప్‌ తీసుకొస్తోంది. ఇక అటు క్లైమాక్స్‌ ట్విస్ట్‌కు మైండ్‌బ్లాంక్ అవుతుందని ప్రశాంత్ నీల్‌ చెప్పిన మాటలు మరింత క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నాయ్. దీంతో ప్రశాంత్‌ను ట్రోల్‌ చేయడం స్టార్ట్ చేశారు నెటిజన్లు. హైప్‌తో చంపేస్తావా నీల్‌ మావా అని కొందరు.. ఇంకెన్ని సర్‌ప్రైజ్‌లు దాచిపెట్టాడు నీల్‌ డార్లింగ్‌ అని ఇంకొందరు.. పోస్టులు పెడుతున్నారు. ఏమైనా సలార్‌ క్రేజ్‌ ఇప్పుడు పీక్స్‌కు చేరింది. పాన్‌ఇండియా లెవల్‌లో సినిమా మీద హైప్‌ క్రియేట్ అయింది. మరి ప్రభాస్ వాటిని అందుకుంటాడా లేదా అన్నది హాట్‌టాపిక్ అవుతోంది. బాహుబలి తర్వాత వచ్చిన మూడు సినిమాలు.. ప్రభాస్‌కు నిరాశనే మిగిల్చాయ్. దీంతో ఈసారి కొడితే బాక్సాఫీస్ బద్దలవాలా అంటూ ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు.