Prabhas : ‘కన్నప్ప’ కోసం రంగంలోకి ప్రభాస్..

అసలు ప్రభాస్ (Prabhas) ఇంత బిజీ షెడ్యూల్‌ను ఎలా మ్యానేజ్ చేస్తున్నాడు ఒకేసారి ఇన్నిసినిమాలు ఎలా చేస్తున్నాడు? అనే విషయం అంతుబట్టకుండా ఉంది.

 

 

 

అసలు ప్రభాస్ (Prabhas) ఇంత బిజీ షెడ్యూల్‌ను ఎలా మ్యానేజ్ చేస్తున్నాడు ఒకేసారి ఇన్నిసినిమాలు ఎలా చేస్తున్నాడు? అనే విషయం అంతుబట్టకుండా ఉంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదారు భారీ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు డార్లింగ్ (Darling). ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా షూటింగ్స్‌లో పాల్గొంటున్నాడు. రీసెంట్‌గా రాజాసాబ్ సెట్‌లో కనిపించిన ప్రభాస్.. ఇప్పుడు కన్నప్ప షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు.

ఇంత బిజీ షెడ్యూల్‌లో కూడా మంచు విష్ణు కోసం డేట్స్ ఇచ్చాడు ప్రభాస్. మంచు విష్ణు (Manchu Vishnu) కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో కన్నప్ప సినిమా తెరకెక్కతోంది. ఈ సినిమాలో ప్రభాస్ శివుడిగా కనిపిస్తాడని ముందు నుంచి ప్రచారంలో ఉంది. కానీ ప్రభాస్ వద్దని చెప్పడంతో.. అక్షయ్ కుమార్‌ (Akshay Kumar) ను శివుడిగా తీసుకున్నారని వార్తలు వచ్చాయి. రీసెంట్‌గానే అక్షయ్‌కు సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ చేశారు. దీంతో.. ప్రభాస్ నందీశ్వరుడి పాత్రలో నటించబోతున్నట్లుగా టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు ప్రభాస్ కన్నప్ప షూటింగ్‌లో జాయిన్ అయ్యాడని తెలుపుతూ.. ఒక ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేశాడు మంచు విష్ణు.

ఇందులో.. జస్ట్ ప్రభాస్ కాలిని మాత్రమే హైలెట్ చేశారు. కానీ ఈ లుక్ ప్రకారం.. ప్రభాస్ శివుడుగానే కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. కాళ్లకు కడియం, ఆ వేషధారణ శివుడిలాగే ఉంది. దీంతో.. కన్నప్పలో ప్రభాస్ శివుడు క్యారెక్టర్ చేస్తున్నాడని ఫిక్స్ అయిపోయారు. ఇక కన్నప్పకోసం ప్రభాస్ కేవలం మూడు రోజుల సమయం మాత్రమే ఇచ్చినట్టుగా సమాచారం. ఏదేమైనా.. కన్నప్పలో ప్రభాస్ అడుగుపెట్టడంతో.. ఒక్కసారిగా అంచనాలు భారీగా పెరిగిపోయాయి.