SALAAR: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్‌లో విపరీతమైన మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోస్‌లో ప్రభాస్ టాప్ లిస్ట్‌లో ఉంటాడు. ప్రభాస్ సినిమా వస్తుంది అంటే చాలు ఫ్యాన్స్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఇక సినిమా రిలీజ్ అంటే.. వాళ్లకు అదో పెద్ద పండగే. ముందు రోజు నుంచే థియేటర్ దగ్గర సెలబ్రేషన్స్ స్టార్ట్ చేస్తారు. ప్రపంచాన్ని మర్చిపోయి ఎంజాయ్ చేస్తుంటారు.
Guntur Karam Item Song : మహేష్ కోసం మాస్ మసాలా సాంగ్
ఇక ప్రభాస్ బర్త్ డే వచ్చిందంటే ట్విటర్‌లో హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవ్వాల్సిందే. అలాంటి ప్రభాస్.. ప్రశాంత్ నీల్ లాంటి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు అంటే ఫ్యాన్స్ ఆనందం, అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో తెలిసిందే. కానీ అలాంటి ఫ్యాన్స్‌కు గుంటూరు నాజ్ సెంటర్‌లో పీవీఆర్ థియేటర్ మేనేజ్‌మెంట్ షాకిచ్చింది. 18 ఏళ్లు నిండనివాళ్లను సినిమాకు అనుమతించబోమంటూ అడ్డుకున్నారు థియేటర్ నిర్వాహకులు. సరదా సరదాకే ట్రెండ్‌లు క్రియేట్ చేసే ఫ్యాన్స్.. సలార్ సినిమాకు అనుమతించము అంటే ఊరుకుంటారా..? థియేటర్ ముందు నానా రచ్చా చేశారు. టికెట్లు బుక్ చేసుకునేముందు ఈ రూల్ గురించి ఎందుకు చెప్పలేదంటూ నిలదీశారు.
దీంతో థియేటర్ యజమానులకు, ఫ్యాన్స్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మాటా మాటా పెరిగి విషయం పోలీసుల వరకూ వెళ్లింది. దీంతో పోలీసులు ఫ్యాన్స్‌ను అదుపు చేశారు. తమను సినిమాకు అనుమతించకపోతే టికెట్ డబ్బులు వెంటనే వెనక్కి ఇచ్చేయాలంటూ ఫ్యాన్స్ గొడవ చేశారు. వారం రోజుల్లో అందరికీ డబ్బులు రీఫండ్ చేస్తామంటూ పీవీఆర్ సినిమాస్ యాజమాన్యం హామీ ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్ వెనక్కి తగ్గారు.