కల్కీ 2898 ఏడీ” ఇండియన్ సినిమాకు సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసిన సినిమా. 1200 కోట్ల వసూళ్లతో ప్రభాస్ కెరీర్ లో సూపర్ హిట్ సినిమాగా చరిత్ర సృష్టించింది. ప్రభాస్ రేంజ్ ఏంటో మరోసారి ఈ సినిమా చాటి చెప్పింది. బాలీవుడ్ హీరోలు సైతం ఈ సినిమాను చూసి కుళ్ళుకున్నారు అనేది కొందరి వ్యాఖ్యలు చూస్తే స్పష్టంగా అర్ధమవుతుంది. కల్కీ పార్ట్ 1 తో దర్శకుడు నాగ్ అశ్విన్ రేంజ్ కూడా పెరిగింది. ఈ సినిమా ముందు వరకు చిన్న దర్శకుడిగా ఉన్న నాగ్ అశ్విన్ ఈ సినిమాతో అగ్ర దర్శకుడు అనే పేరు తెచ్చుకున్నాడు అనే చెప్పాలి.
ఇక కల్కీ పార్ట్ 2 ఎప్పుడు ఉంటుంది అనే దానిపై చాలానే అంచనాలు ఉన్నాయి. వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉందని పలువురు భావించారు. నిర్మాత అశ్వనీ దత్ మాటల ప్రకారం చూస్తే… సినిమా మొదటి పార్ట్ షూటింగ్ సమయంలోనే రెండో పార్ట్ షూటింగ్ కూడా జరిగింది. ముఖ్యంగా కమల్ హాసన్ కు సంబంధించిన సన్నివేశాలు ఎక్కువగా షూట్ చేసారు. వాటిని ఎడిటింగ్ చేయాల్సి ఉందట. కమల్ హాసన్ సినిమాలో పార్ట్ అయిన తర్వాతనే రెండో భాగం ఆలోచన వచ్చిందని అశ్వనీ దత్ పేర్కొన్నారు.
ఇక తాజాగా ఆయన కుమార్తెలు… కల్కీ సినిమా నిర్మాతలు ప్రియాంకా దత్, స్వప్నా దత్ ఇద్దరూ కీలక వ్యాఖ్యలు చేసారు. మాస్కో ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొన్న ఈ ఇద్దరూ… పార్ట్ 2 గురించి క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్ జనవరి లేదా ఫిబ్రవరిలో ప్రారంభం అయ్యే అవకాశం ఉందని అన్నారు. సినిమా షూట్ మొదలైన తర్వాతనే సినిమాకు సంబంధించి మరిన్ని విషయాలు చెప్తామని, తాము ఇంకా కల్కీ మొదటి పార్ట్ విజయానికి సంబంధించిన వేడుకలు చేసుకోవడం లేదని వాట్సాప్ లోనే జరుగుతున్నాయని అన్నారు. ప్రస్తుతం సినిమా సక్సెస్ ను అందరం ఎంజాయ్ చేస్తున్నామని పేర్కొన్నారు.