రెబల్ స్టార్ కల్కీ వచ్చి నెలలు గడుస్తోంది. కాని ఇండస్ట్రీలో తన గురించో, తన సినిమా గురించో చర్చలేని రోజులేదు. వచ్చే ఏడాది ఏప్రిల్ లో తన మూవీ ది రాజా సాబ్ రాబోతోంది. కాని ఆ సినిమా ఓవర్ సీస్ రైట్స్ ఇండియన్ సినిమా హిస్టరీలోనే సేల్ కాని రేటుకి సేల్ అయ్యాయి. యూఎస్ రైట్స్ ఏకంగా 150 కోట్లుపలకటం రికార్డే. ఇలా ఎన్నడూ జరగలేదు. అంత పెట్టి కొంటే కనీసం 200 నుంచి 400 కోట్ల వసూళ్లు వస్తేనే, అందులో 160 నుంచి 200 కోట్ల వరకు షేర్స్ రూపంలో అక్కడి డిస్ట్రిబ్యూటర్లకు గిట్టుబాటు అవుతుంది. కాని అక్కడ 100 నుంచి 140 కోట్లే హయ్యెస్ట్ వసూళ్ల రికార్డు ఉంది. అంటే 150 కోట్లు పెట్టి ది రాజా సాబ్ యూఎస్ రైట్స్ కొంటే, 10 కోట్ల నష్టం ఇన్ స్టెంట్ గా వచ్చినట్టే. కాని కొన్ని సార్లు కటౌట్ ని చూసినమ్మాలన్న మాటే, రెబల్ స్టార్ మరో సారి ప్రూవ్ చేస్తున్నాడు. 140 కోట్లకు మించేంత మార్కెట్ లేని యూఎస్ లో, 150 కోట్ల పెట్టుబడిని 400 కోట్లు రాబడిగా మార్చే సత్తా రెబల్ స్టార్ కి ఉందా? రిలీజ్ కి ముందే ది రాజా సాబ్ అలా ఎలా యూఎస్ మార్కెట్ లో ఇండియన్ సినిమా ఫేట్ మార్చేస్తాడు..? ఆ లాజిక్ వెనకున్న మ్యాజికే మైండ్ బ్లాంక్ చేసేలా ఉంది.. అదేంటోచూసేయండి.
కల్కీ మూవీ 1200 కోట్ల వసూళ్లు కొల్లగొట్టి నెలలు గడుస్తోంది. ఇంతలో ది రాజా సాబ్ తాలూకు యూఎస్ రైట్స్ తో రెబల్స్ ఫ్యాన్స్ కే కాదు, కామన్ ఆడియన్స్ మతికూడా పోయేలా ఉంది. పాన్ ఇండియా కింగ్ ప్రభాస్ కి యూఎస్ మార్కెట్ లోఉన్న క్రేజ్, మార్కెట్ లోమైలేజ్ ది రాజా సాబ్ రిలీజ్ కి6 నెలల ముందే మరోసారి బయట పడింది
ది రాజా సాబ్ 2025 ఏప్రిల్ లోరిలీజ్ కాబోతోంది. అంటే ఇంకా 6 నెల్ల టైం ఉంది. ఈలోపే ఈ సినిమా యూఎస్ రైట్స్ ని 150 కోట్లకు సేల్ చేశారు. అమెరికాలో ఇప్పటి వరకు ఓ ఇండియన్ సినిమాకు వచ్చిన హయ్యెస్ట్ షేర్ వసూళ్లు 140 కోట్లు. కాని దానికి మరో పది కోట్లు అదనంగా కలిపి యూఎస్ రైట్స్ ని దక్కించుకుంటున్నారు
అంటే ఇది హిట్టై 150 కోట్లు రాబట్టిన ఆ డిస్ట్రిబ్యూటర్లకు ఎలాంటి లాభం లేనట్టే..కాని రెబల్ స్టార్ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు నష్టం తెస్తుందా..? అది కూడా హిట్ మెట్టెక్కాకా.. ఇంపాజిబుల్.. ఇక్కడే రాజమౌళి ఫార్ములా షాక్ ఇస్తోంది
నిజానికి బాహుబలిని 200 కోట్లతో తీస్తుంటే, తెలుగు మార్కెట్టే 200 కోట్లు లేదు అలాంటప్పుడు బాహుబలిని 200 కోట్లతో తీస్తారా అన్నారు. కాని ఏమైంది నార్త్ ఇండియాలో కొత్త మార్కెట్ తెరుచుకుని 200 కోట్ల బాహుబలిని, 550 కోట్లు మహాబలిగా మార్చాడు జక్కన్న. ఇక 500కోట్ల పెట్టి తీసిన బాహుబలి 2 అయితే ఏకంగా 1850 కోట్లు రాబట్టింది.
అంటే కొన్ని సార్లు మార్కెట్ ఇంతే అనుకోవటానికి లేదు. కుదిరితే మార్కెట్ పెంచుకోవటమే అన్న ఫార్ములా బాహుబలితో మొదలైంది. సో ఇదే ట్రెండ్ ఇప్పుడు ది రాజా సాబ్ కి అప్లైచేస్తున్నారు. నార్త్ అమెరికాలో ఏ తెలుగుసినిమా వచ్చినా, మినిమమ్ 14 డాలర్లనుంచి 35 డాలర్ల వరకు టిక్కెట్ ప్రైజ్ ఉంటుంది… అంటే మన కరెన్సీలో 1200 నుంచి 2800 రూపాయల వరకు అక్కడ టిక్కెట్ ధర ఉండేది.. ఇప్పడా ధర 50 డాలర్లనుంచి 100 డాలర్లకు పెంచబోతున్నారట.
నార్త్ అమెరికాలో ఇండియన్ మూవీస్ కి ముఖ్యంగా టాలీవుడ్ నుంచి వచ్చే పాన్ ఇండియా సినిమాలకు, భారీగా డిమాండ్ ఉంటోంది. అక్కడ తెలుగు జనాలకే కాదు ఇండియన్స్ అందరికి, మన సినిమాలు మంచి ఎంటర్ టైనర్ గా మారాయి. అందుకే పాన్ ఇండియా మూవీలేవైనా, మరీ ముఖ్యంగా రెబల్ స్టార్ సినిమాలు వస్తున్నాయంటే, టిక్కెట్ ప్రైజ్ ని అక్కడ లెక్క చేయట్లేదు
అందుకే ది రాజా సాబ్ టిక్కెట్ రేటు 50 నుంచి 100 డాలర్లంటే, 4 వేలనుంచి 8 వేల వరకు టిక్కెట్ ప్రైజ్ పెంచేలా ఉన్నారు. అలా లెక్కేస్తే కేవలం యూఎస్ లోనే ది రాజా సాబ్ హిట్ అయితే, ఈజీగా 400 కోట్ల నుంచి 800 కోట్ల వరకు రాబట్టొచ్చు.. ఇవి గ్రాస్ వసూల్ల అంచనాలే… కాలం కలిసొస్తే, యూఎస్ లోనే వెయ్యికోట్లు రాబట్టిన సినిమాగా మారే రోజులు వచ్చే ఛాన్స్ఉంది. పాన్ ఇండియా ట్రెండ్, 300 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న హిస్టరీ లాంటి విచిత్రాలే, రెబల్ స్టార్ ఇప్పుడు దిరాజా సాబ్ యూఎస్ రైట్స్ విషయంలో క్రియేట్ చేసేలా ఉన్నాడు.