PRABHAS: సలార్ ఇంట్రో సీన్ బాబోయ్.. మెంటలెక్కిపోతారు

బెనిఫిట్ షోలు చుసిన కొందరు సినీ ఇండస్ట్రీ పెద్దలు.. ప్రభాస్ ఎంట్రీ సీన్ చూస్తూ, ఆ తరువాత జరిగిన సన్నివేశాలెంటో చూడటమే మర్చిపోయాం అంటున్నారు.

  • Written By:
  • Updated On - December 21, 2023 / 07:41 PM IST

PRABHAS: ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న ‘సలార్’ మూవీ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే సినిమాపై ఏ రేంజ్‌లో అంచనాలు ఉన్నాయా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాని ఫస్ట్ డే.. ఫస్ట్ షో చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. ఇప్పటికే అన్నిచోట్ల ‘సలార్’ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.

SALAAR: సలార్‌కి పోటీ ఇచ్చే సత్తా.. డంకీ, ఆక్వామ్యాన్ 2కి లేదా..?

అయితే, బెనిఫిట్ షోలు చుసిన కొందరు సినీ ఇండస్ట్రీ పెద్దలు.. ప్రభాస్ ఎంట్రీ సీన్ చూస్తూ, ఆ తరువాత జరిగిన సన్నివేశాలెంటో చూడటమే మర్చిపోయాం అంటూ తమ గూస్ బంప్స్ మూమెంట్స్ తలచుకున్నారు. ప్రచార చిత్రాల్లో చూపెట్టినట్టు నిజంగానే ఒక డైనోసార్ రేంజ్ ఇంట్రో ప్రభాస్‌కి పడింది అంటూ, కొట్టొచ్చినట్టు కనబడే ఆవేశాన్ని తమ కళ్ళలో ఒలికించారు. ఆ ఒక్క సీన్ చాలు.. సలార్ వందకోట్లకు సమానం అంటూ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌కు కంగ్రాచులేషన్స్ చెప్పుకొస్తున్నారు. ఇదిలా ఉంటే.. మరోవైపు మూవీ టీం బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తూ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తోంది.

Sandeep Reddy Vanga: అజ్ఞానులు.. రివ్యూయర్లపై సందీప్ రెడ్డి వంగా పంచ్..

సరిగ్గా రెండు రోజుల క్రిందట ‘సలార్’ రిలీజ్ ట్రైలర్ విడుదల చేయగా ఆ ట్రైలర్‌కి అనూహ్య స్పందన వచ్చింది. ఈ సినిమాలో ప్రభాస్.. దేవా అనే పాత్రలో, పృధ్విరాజ్.. వరదరాజమన్నార్ అనే పాత్రలో కనిపించబోతున్నారు. ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులుగా ఎలా మారారు? అనే కథాంశంతో సలార్ మూవీ తెరకెక్కింది. సినిమాలో ప్రభాస్‌కి జోడీగా శృతిహాసన్ హీరోయిన్‌గా నటించింది. జగపతిబాబు, ఈశ్వరీ రావు, బాబీ సింహ, టినూ ఆనంద్, సప్తగిరి ఇతర కీలకపాత్రలు పోషిస్తున్నారు. కేజిఎఫ్ సినిమాని నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని సుమారు రూ.250 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మించారు.