PRABHAS: స్పిరిట్ విషయంలో మాట మార్చిన సందీప్ రెడ్డి

స్పిరిట్ మూవీని ఉన్న ఫలంగా ఫిబ్రవరిలో మొదలు పెట్టాల్సి రావటం. ఆల్రెడీ స్పిరిట్ స్క్రిప్ట్ వర్క్ పూర్తైందట. కేవలం స్క్రిప్ట్‌ని మరింత ఫిల్టర్ చేస్తున్న సందీప్.. జనవరి ఎండ్ కల్లా ఫైనల్ డ్రాఫ్ట్‌తో షూటింగ్‌కి రెడీ అవుతాడట.

  • Written By:
  • Updated On - December 27, 2023 / 08:16 PM IST

PRABHAS: స్పిరిట్ మూవీ వేగం పెంచాలి. ఇది ఉన్నట్టుండి ప్రభాస్‌కి సందీప్ రెడ్డి వంగ నుంచి వచ్చిన మెసేజ్. యానిమల్ హిట్‌తో స్వింగ్‌లో ఉన్న సందీప్ రెడ్డి వంగ సక్సెస్ జోష్‌లో మరీ వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్టున్నాడు. దాని ఎఫెక్టే స్పిరిట్ మూవీ షూటింగ్ ఫిబ్రవరిలో మొదలవ్వాలని ప్రభాస్ మీద తను ప్రెజర్ పెంచటం. ఎప్పుడో అక్టోబర్‌లో ఈ సినిమా సెట్స్ పైకెళుతుందని యానిమాల్ మూవీ ప్రమోషన్ టైంలో చెప్పిన సందీప్.. ఇప్పుడు మాట మార్చాడు.

DEVARA: యంగ్ టైగర్ వేట.. మాస్‌ జాతరకు ఇంకా మిగిలింది 100 రోజులే.!

ఒకటి తన యానిమల్ మూవీ ఊహించిన దానికంటే భారీగా వసూళ్లు రాబట్టడం, జనాలు పిచ్చి పిచ్చిగా చూస్తుండటంతో తను ఉబ్బితబ్బిబ్బైపోతున్నాడు. అలానే సలార్ భారీ సక్సెస్‌తో ప్రభాస్ కూడా మంచి జోష్‌లో ఉన్నాడు. ఇలా ఇద్దరు వెయ్యికోట్ల మత్తులో చిత్తవుతున్నారనుకుంటుంటే ఈ కాంబినేషన్ తాలూకు కీలక అప్‌డేట్ షాక్‌కి గురిచేసేలా ఉంది. అదే.. స్పిరిట్ మూవీని ఉన్న ఫలంగా ఫిబ్రవరిలో మొదలు పెట్టాల్సి రావటం. ఆల్రెడీ స్పిరిట్ స్క్రిప్ట్ వర్క్ పూర్తైందట. కేవలం స్క్రిప్ట్‌ని మరింత ఫిల్టర్ చేస్తున్న సందీప్.. జనవరి ఎండ్ కల్లా ఫైనల్ డ్రాఫ్ట్‌తో షూటింగ్‌కి రెడీ అవుతాడట. ఫిబ్రవరిలో ఆఫీస్ ప్రారంభంతోపాటు ప్రీప్రొడక్షన్ పనులు పూర్తౌతాయి. ఫిబ్రవరి ఎండ్‌కల్లా షూటింగ్‌కి వెళ్లాలి. ఇది ఇప్పటికిప్పుడు సందీప్ నుంచి ప్రభాస్‌కి వెళ్లిన కమాండ్ లాంటి రిక్వెస్ట్. అంతటికీ కారణం యానిమల్ పార్కే.. యానిమల్ హిట్ అవటంతో సాధ్యమైనంత త్వరగా సీక్వెల్ అయిన యానిమల్ పార్క్ మొదలు పెట్టాలనుకుంటున్నాడు సందీప్.

అందుకే స్పిరిట్‌ని ఫిబ్రవరి ఎండ్‌లో మొదలు పెట్టి, డిసెంబర్‌లోగా పూర్తి చేస్తాడట. ఇక దసరాకు యానిమల్ పార్క్‌ని లాంచనంగా మొదలు పెట్టి 2025 దసరాకు రిలీజ్ చేస్తాడట. ఈ నిర్ణయాలే కల్కి, మారుతి మూవీల పెండింగ్ షూటింగ్‌కి టైం ఇవ్వలేని ప్రభాస్‌ని ఇరిటేట్ చేస్తున్నాయట. ఇంకా డేట్స్ ఇష్యూ తేలలేదు. హను రాఘవపూడి ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఇంతలో సందీప్ రెడ్డి పెట్టే ప్రెజరే ప్రభాస్‌కి నచ్చట్లేదని తెలుస్తోంది.